Moviesబాలయ్య "వీర సింహా రెడ్డి" పబ్లిక్ టాక్: హిట్టా..ఫట్టా..?

బాలయ్య “వీర సింహా రెడ్డి” పబ్లిక్ టాక్: హిట్టా..ఫట్టా..?

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా ఆశగా ఎదురుచూసిన వీరసింహ రెడ్డి సినిమా ..కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. షో స్టార్ట్ అవ్వకముందు నుంచి థియేటర్స్ వద్ద నందమూరి అభిమానులు చేసిన హంగామా.. రచ్చ.. అంతా ఇంతా కాదు . గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి ఫ్యాన్స్ . అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మరోసారి తెరపై కనిపించి సందడి చేసిన వీరసింహారెడ్డి సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

మొదటి నుంచి సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన గోపీచంద్ మల్లినేని అభిమానులు అంచనాలకు ఏమాత్రం తీసికొని విధంగా ఈ సినిమాను డైరెక్టర్ చేశాడు. అంతే కాదు బాలయ్యలోని మాస్ యాంగిల్ ని మరోసారి బయటపెట్టి నరసింహా నాయుడు, సమరసింహారెడ్డి స్థాయి రేంజ్ బాలకృష్ణ ను చూపించాడు. మరి ముఖ్యంగా సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్న కాన్సన్ట్రేషన్ మొత్తం బాలయ్య పై పెట్టి అన్ని మాస్ యాగిల్స్ లో.. అన్ని కోణాల్లో చూపించడంలో గోపీచంద్ మల్లినేని ప్లస్ అయ్యాడనే చెప్పాలి .

ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తమన్ సంగీతం . బాలయ్య మాస్ యాంగిల్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పాలి . అంతేకాదు శృతిహాసన్ , హనీ రోజ్ లాంటి అందాల ముద్దుగుమ్మలు ఉన్నా కానీ సినిమాని మరో మట్టి ఎక్కించింది వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేసింది . సినిమా హిట్ కాదు బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . చూడాలి మొదటి రోజు వీ సింహారెడ్డి ఏ విధంగా కలెక్షన్స్ సాధిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news