Moviesరోజాకు మెగాస్టార్ కౌంట‌ర్ పేలిపోయిందిగా... నో ఆన్స‌ర్‌...!

రోజాకు మెగాస్టార్ కౌంట‌ర్ పేలిపోయిందిగా… నో ఆన్స‌ర్‌…!

రీసెంట్‌గా ఏపీ మంత్రి, ఒక‌ప్ప‌టి హీరోయిన్ ఆర్కే రోజా మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు చిరంజీవి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఆమె పేరు ఎత్త‌కుండానే అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా ఈ నెల 13న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ప్ర‌మోష‌న్లు వేగ‌వంతం చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో చిరు రోజాపై చేసిన కౌంట‌ర్ వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

కొద్ది రోజుల క్రితం రోజా మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ సినీ న‌టుల‌కు సెన్సిటివ్‌, ఎమోష‌న‌ల్ ఎక్కువుగా ఉంటుంది.. ఎమ్జీఆర్, జ‌య‌ల‌లిత‌, ఎన్టీఆర్ లాంటి దిగ్గ‌జ న‌టులు ప్ర‌జ‌ల నుంచి చాలా గౌర‌వం పొందారు.. అయితే చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్‌కు ఎలాంటి ఎమోష‌న్లు లేవు.. అందుకే ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌ను ప్ర‌జ‌లు వారి సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లోనే తిర‌స్క‌రించారన్నారు.

అయితే రోజా వ్యాఖ్య‌ల‌కు నాగ‌బాబు ఇప్ప‌టికే కౌంట‌ర్ ఇచ్చారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన చిరు ఇప్ప‌టి వ‌ర‌కు నాతో స్నేహంగా ఉండి.. నా స‌హాయం తీసుకుని.. నా ఇంటికి వ‌చ్చిన వారు కూడా నేను ఏ సాయం చేయ‌లేదంటున్నారు… నేను ఎవ‌రికి సాయం చేశానో తెలుసు… అలాగే నా సాయం తీసుకున్న వారికి కూడా తెలుసు.. నా గురించి తెలిసి మాట్లాడారో.. తెలియ‌క మాట్లాడారో అలాంటి వారిని తాను ప‌ట్టించుకోన‌న్నారు.

నా పేరు వాడ‌క‌పోతే వారికి మ‌నుగ‌డ ఉండ‌ద‌ని.. అందుకే నా గురించి మాట్లాడుతున్నారంటూ రోజాకు ప‌రోక్షంగా కౌంట‌ర్ వేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఒక‌ప్పుడు త‌న కుటుంబం గురించి త‌ప్పుగా మాట్లాడితే బాధ‌ప‌డేవాడిని అని.. ఇప్పుడు అలాంటి మాట‌లు ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌న్నారు. ప‌వ‌న్ రాజ‌కీయాల గురించి మాట్లాడిన చిరు.. త‌మ్ముళ్ల దారి త‌మ్ముళ్ల‌ది.. త‌న దారి త‌న‌దే అన్నారు.

Can Megastar Chiranjeevi and Akkineni Nagarjuna get MLA Roja back on big  screen?

ఇక అల్లు అర‌వింద్ కుటుంబంతో ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌న్న చిరు.. వృత్తిప‌ర‌మైన పోటీ నేప‌థ్యంలో ఎవ‌రి దారులు వారు చూసుకోవ‌డంలో త‌ప్పులేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏదేమైనా చిరు ఇచ్చిన కౌంట‌ర్‌కు రోజా ద‌గ్గ‌ర ఆన్స‌ర్ లేద‌నే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news