Moviesవీర సింహా రెడ్డి రివ్యూ: బాలయ్య మిగతా సినిమాల్లో లేనిది..ఈ సినిమా...

వీర సింహా రెడ్డి రివ్యూ: బాలయ్య మిగతా సినిమాల్లో లేనిది..ఈ సినిమా లో ఉన్నది ఇదే..ఇరగదీసేసాడు..!!

టాలీవుడ్ నటి సింహం నందమూరి బాలయ్య ..రీసెంట్గా హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది సేపటి క్రితమే గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . మొదటినుంచి సినిమాపై హ్యూజ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ అయ్యాక ఫుల్ సాటిస్ఫై అయిపోయారు . బాలయ్య లాంటి మాస్ హీరోని ఇప్పటివరకు తెరపై పర్ఫెక్ట్ గా చూపించిన డైరెక్టర్ గా బోయపాటి శ్రీను మాత్రమే అభిమానులను మెప్పించ గలిగాడు.

కాగా ఇప్పుడు అదే లిస్టులోకి గోపీచంద్ యాడ్ అయిపోయాడు . అఖండ కాదు దానికి మించిన బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా అయ్యే విధంగా గోపీచంద్ మల్లినేని బాలయ్యను తెరపై చూపించిన విధానం నందమూరి ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది . అంతేకాదు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమాపై హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ వీరసింహారెడ్డి టైటిల్ ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు . కాగా బాలయ్య సినిమా అంటేనే మాస్ డైలాగ్స్ ..మాస్ యాక్షన్..మాస్ ఫైట్,, ఇవన్నీ కామన్ గానే కనిపిస్తూ ఉంటాయి. బాలయ్య మొదటి సినిమా నుంచి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన అఖండ వరకు బాలయ్య అనగానే అందరికీ మాస్ యాక్షన్ ఫైట్స్, డైలాగ్స్ నే గుర్తొస్తాయి.

కానీ ఈ సినిమాలో మాస్ యాంగిల్ తో పాటు బాలయ్యలోని రొమాంటిక్ యాంగిల్ ని బయటపడుతూ పలు సాంగ్స్ లో పలు డైలాగ్స్ లో గోపీచంద్ మల్లినేని తీసుకున్న కేర్ జనాలకు విపరీతంగా నచ్చేసింది . అంతేకాదు ఈ సినిమాల్లో మరీ ముఖ్యంగా బాలయ్య వేసిన డాన్స్ స్టెప్స్ థియేటర్స్ లో జనాలకు పూనకాలు తెప్పిస్తున్నాయి. మాస్ మొగుడు సాంగ్ వస్తున్నప్పుడు ..సుగుణసుందరి సాంగ్ స్క్రీన్ ప్లే అవుతున్నప్పుడు జనాలు ఎవరు థియేటర్స్ లో తమ సీట్లలో కూర్చోవట్లేదు.. అరుపులతో కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతుంది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. మరియు ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య వేసిన స్టెప్స్ నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా వీరసింహారెడ్డి సినిమా తెలుగు ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారబోతుంది అన్నది మాత్రం వాస్తవం . చూడాలి మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా సాధించి రికార్డులను కొల్లకొడుతుందో బాలయ్య వీర సింహారెడ్డి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news