Moviesనాగేశ్వరరావు-నాగార్జున-నాగ చైతన్య.. అఖిల్ "నాగ" అనే పేరుని పెట్టుకోకపోవడానికి రీజన్ ఇదే..!!

నాగేశ్వరరావు-నాగార్జున-నాగ చైతన్య.. అఖిల్ “నాగ” అనే పేరుని పెట్టుకోకపోవడానికి రీజన్ ఇదే..!!

చాలామంది జాతకాలు నమ్ముతారు .. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతారు అన్నది వాస్తవం . కాగా ఏ విషయాల్లో సెంటిమెంట్ ఫాలో అవ్వని అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీకి ఉన్న నాగ అనే సెంటిమెంట్లు మాత్రం తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాడు . మనకు తెలిసిందే అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడు సినిమా ఇండస్ట్రీలోకి నాన్న పేరు చెప్పుకొని వచ్చిన నాగార్జున ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెంచుకున్నాడు .

మనం కాకుండా.. నాగార్జున తన తండ్రి ఏఎన్నార్‌తో కలిసి నటించిన సినిమాలు ఇవే..  | Not only manam movie nagarjuna akkineni act with his father anr Akkineni  Nageswara Rao these films– News18 Telugu

ఇప్పటికీ మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు నాగార్జున ఫ్యాన్స్ అని చెప్పడంలో సందేహం లేదు . కాగా నాగేశ్వరరావు నాగార్జున – నాగచైతన్య ఇలా ముగ్గురు పేర్లు నాగ అనే పదం కామన్ గా కనిపిస్తుంది . దానికి మెయిన్ రీజన్ నాగేశ్వరరావు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఆయనకు పాలిస్తున్న టైంలో నాగుపాము అటువైపుగా కనిపించిందట . అంతేకాదు ఆ తర్వాత కూడా ఆమెకు ఎక్కువగా కలలో నాగుపాము కనిపించడంతో ఆయనకి నాగేశ్వరరావు అంటూ పేరు పెట్టుకోచిందట . అదేవిధంగా నాగర్జున అమ్మగారికి జరగడంతో నాగార్జున అంటూ పేరు పెట్టారట . ఇక నాగచైతన్య విషయంలో ఇంచుమించుగా అలాగే జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

Nagarjuna's Thank You with Chaitanya will be an emotional treat, promises  BVS Ravi | Entertainment News,The Indian Express

నాగచైతన్య కడుపులో పడిన టైం నుంచి దగ్గుబాటి లక్ష్మికి నాగుపాము ఎక్కువగా కలలో కనిపించేది అని ఈ కారణంగానే అక్కినేని ఫ్యామిలీ కు నాగ అనే సెంటిమెంట్తో నాగచైతన్య అనే పేరును పెట్టారని తెలుస్తుంది. కాగా అఖిల్ అక్కినేని విషయానికి వచ్చేసరికి అమల అలాంటి రూల్స్ సెంటిమెంట్స్ ఏం పెట్టుకోలేదు . తనకు ఇష్టం వచ్చిన పేరుని అలా పట్టుకొచ్చింది . దానికి మెయిన్ రీజన్ అక్కినేని అమల ఎటువంటి సెంటిమెంట్స్ ఫాలో అవ్వదు . అంతేకాదు మొదటి నుంచి పూజలకు దైవ కార్యక్రమాలకు దూరంగా ఉండే అక్కినేని అమల ..ఇలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ని నమ్మదు అంటూ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా వైరల్ అవుతుంది. ఈ కారణంగానే అమల అక్కినేని అఖిల్ కు పేరు ముందు నాగా అని చేర్చడానికి ఇష్టపడలేదు అంటూ తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news