Moviesనంద‌మూరి పండ‌గ‌: బింబిసార డైరెక్ట‌ర్‌కు బాల‌య్య గ్రీన్‌సిగ్న‌ల్‌... నిర్మాత ఎవ‌రంటే..!

నంద‌మూరి పండ‌గ‌: బింబిసార డైరెక్ట‌ర్‌కు బాల‌య్య గ్రీన్‌సిగ్న‌ల్‌… నిర్మాత ఎవ‌రంటే..!

నంద‌మూరి న‌ట‌సింహం వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నారు. ఈ సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడి సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఇప్ప‌టికే అనిల్ రావిపూడి సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను కూడా ఇదే యేడాది జూలై లేదా ఆగస్టులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక అనిల్ రావిపూడి సినిమా పూర్త‌యిన వెంట‌నే బోయ‌పాటి శ్రీనుతో బాల‌య్య సినిమా ఉంటుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్ త‌ర్వాత బోయ‌పాటికి మ‌రో ఛాన్స్ ఇచ్చేశాడు బాల‌య్య‌. 2024 ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ‌చ్చే మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ముందు ప్లాన్ చేసుకున్నారు. బాల‌య్య అనిల్ రావిపూడి త‌ర్వాత ఖ‌చ్చితంగా బోయ‌పాటి సినిమానే చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

అయితే ఇప్పుడు మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. బోయ‌పాటి కంటే ముందు బాల‌య్య మ‌రో సినిమాకు క‌మిట్ అయ్యారంటున్నారు. మైత్రీ మూవీస్ లో భాగస్వామిగా ఉండి బ‌య‌ట‌కు వ‌చ్చిన సీవీ మోహ‌న్ ఇప్పుడు ఓన్ బ్యాన‌ర్ స్టార్ట్ చేశారు. ఆయ‌న‌కు ఓ సినిమా చేసేందుకు బాల‌య్య ఓకే చెప్పారు. అయితే బింబిసార‌తో హిట్ కొట్టిన మ‌ల్లిడి వ‌శిష్ట్‌కు బాల‌య్య ఓ సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

బింబిసార స్పెష‌ల్ షో చూసిన బాల‌య్య మీడియా ముందే చాలా బాగా చేశావ‌య్యా.. త‌ప్ప‌కుండా క‌లిసి చేద్దాం అన్నారు. ఈ క్ర‌మంలోనే వ‌శిష్ట్ రెడీ చేసుకున్న క‌థ బాల‌య్య‌కు బాగా న‌చ్చింద‌ట‌. బాల‌య్య ఈ క‌థ‌ను ఓకే చేయ‌డంతో ఇప్పుడు వ‌శిష్ట్ డైరెక్ష‌న్‌లో మోహ‌న్‌కు సినిమా చేసేందుకు బాల‌య్య ఓకే చెప్పేశాడు. అయితే వ‌శిష్ట్ బింబిసార సీక్వెల్ ప‌నుల్లోనూ ఉన్నాడు. ముందు ఆ సినిమా ఉంటుందా ? బాల‌య్య సినిమా ఉంటుందా ? అన్న‌ది తేలాలి.

Director Mallidi Vashist Interview Photos - ManaStars

అలాగే బాల‌య్య అనిల్ రావిపూడి సినిమా త‌ర్వాత వ‌శిష్ట్‌తో వెళ‌తాడా ? లేదా ? బోయ‌పాటితోనే వెళ‌తాడా అన్న ప్ర‌శ్న‌ల‌కు అనిల్ రావిపూడి సినిమా ఎండింగ్‌కు వ‌చ్చాక కాని క్లారిటీ రాక‌పోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news