Moviesమెగా ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటున్న జబర్ధస్త్ కమెడియన్స్ ..డబ్బు కు అమ్ముడుపోయారా..?

మెగా ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటున్న జబర్ధస్త్ కమెడియన్స్ ..డబ్బు కు అమ్ముడుపోయారా..?

అవునండి ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . మేం మెగా ఫ్యాన్స్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతాం.. ప్రాణాలు ఇచ్చేస్తాం అని చెప్పుకునే కొందరు సో కాల్డ్ జబర్దస్త్ కమెడియన్స్ ఈ మధ్యకాలంలో పార్టీ మార్చేసినట్లు పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. పవన్ ని హీరో గా అన్నా కూడా దైవంగా భావించే జనాలు అభిమానులు కోట్లల్లోనే ఉంటారు .

అదే విధంగా ఆయన పేరు చెప్పుకొని పబ్లిసిటీ తెచ్చుకునే జనాలు ఉన్నారు . కాగా జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది . ఆయన మేనరిజాన్ని జబర్దస్త్ కమెడియన్స్ పట్టేసి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటూ చెప్పుకొని ఎన్నో స్కిట్స్ వేసి ఆయన పాపులారిటీతో పబ్లిసిటీ చేసుకొని పాపులారిటీ దక్కించుకున్నారు . అయితే ఈ మధ్యకాలంలో మేం మెగా ఫాన్స్ అంటూ చెప్పుకొని తిరిగే కొందరు జబర్దస్త్ కామెడీయన్స్ పక్క పార్టీ వైపు మొగ్గు చూపడం తో పవన్ ఫ్యాన్స్ కు మండిపోతున్నారు.

ఈ క్రమంలోని జబర్దస్త్ కమెడియన్స్ డబ్బుకు అమ్ముడుపోయారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు నిన్న మొన్నటి వరకు బండి కూడా కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు ఇప్పుడు ఏకంగా కార్లు బంగ్లాలు కొనుక్కొని తిరిగేస్తున్నారు అంటూ కొందరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఏది ఏమైనా సరే డబ్బు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది అన్నది మాత్రం నిజం.. ఆ డబ్బుకి అమ్ముడుపోయి పవన్ ఫ్యాన్స్ ఇలా నిజమైన అభిమానాన్ని అమ్మేసుకున్నారు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news