Moviesకోడుకుల కోసం ఫస్ట్ టైం ఇష్టం లేని పని చేస్తున్న నాగార్జున..ఇండస్ట్రీ...

కోడుకుల కోసం ఫస్ట్ టైం ఇష్టం లేని పని చేస్తున్న నాగార్జున..ఇండస్ట్రీ పెద్దలు షాక్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకు ఎలాంటి పేరు క్రేజ్ , రేంజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు ..అలాంటి ఓ చెరగని స్దాయిని ముద్రించారు. అంతేకాదు ఆ తరువాత ఆ పేరుని కొనసాగిస్తూ అక్కినేని నాగార్జున కూడా అక్కినేని ఇంటి పరువును టాప్ పొజిషన్లో పెట్టారు.

అయితే తాత , తండ్రి ..అక్కినేని ఇంటి పేరుని నిలబెట్టినంత గొప్పగా ఆ తర్వాతి తరం నాగార్జున కొడుకులు అఖిల్ – నాగచైతన్య నిలబెట్టలేకపోయారు ఈ ఇద్దరు హీరోలు. ఇప్పటివరకు సరైన హిట్టు కొట్టిందే లేదు . ఇంతవరకు 100 కోట్ల క్లబ్ లోకి చేరింది లేదు . అఖిల్ , నాగచైతన్య ..వయసుగల మిగతా హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తూ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంటే ..ఇంకా వీళ్ళు సరైన హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు.

ఈ క్రమంలోని నాగార్జున తాను నమ్మని పూజలను, హోమాలను కొడుకుల భవిష్యత్తు కోసం చేయిస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ అక్కినేని కాంపౌండ్ నుంచి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ పండితులను తీసుకొచ్చి అక్కినేని ఇంట్లో హోమాలు వేస్తున్నారట .

అఖిల్ – నాగచైతన్య కెరియర్ బాగుండాలని సినిమాల పరంగా లైఫ్ లో కూడా ముందుకు కొనసాగాలని నాగార్జున ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజను హోమాలను చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పూజలను పెద్దగా పట్టించుకోని నాగార్జున కొడుకుల కోసం ఇలాంటి పనిచేస్తుండడంతో ఇండస్ట్రీ పెద్దలు కూడా షాక్ అయిపోతున్నారు . చూద్దాం ఈ పూజ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news