Moviesనరేష్-పవిత్రా మ్యాటర్ లో షాకింగ్ ట్వీస్ట్..10 కోట్లు ఇస్తే వదిలేస్తా..!!

నరేష్-పవిత్రా మ్యాటర్ లో షాకింగ్ ట్వీస్ట్..10 కోట్లు ఇస్తే వదిలేస్తా..!!

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ – క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే . కాగా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ .. మూడో భార్యకు విడాకులు ఇచ్చేసి మరీ పవిత్ర లోకేషని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . రీసెంట్ గానే న్యూ ఇయర్ సందర్భంగా పవిత్ర లోకేష్ ని కిస్ చేస్తూ వీడియోని రిలీజ్ చేసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించాడు.

కాగా నరేష్ భార్య రమ్య రఘుపతి మాత్రం తనకు డివర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ తనను నమ్మించి మోసం చేశాడు అంటూ నరేష్ పై పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది . ఈ క్రమంలోనే నరేష్ – రమ్య రఘుపతి పై సంచలన కామెంట్స్ చేశారు. “పెళ్లయినప్పటి నుంచి టార్చర్ చూపిస్తుంది.. తనకంటే తన డబ్బు పైన ప్రేమ ఎక్కువగా చూపిస్తుందని ..ఆమెతో తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొస్తున్నాడు”.

అయితే ఇలాంటి క్రమంలోనే రమ్య రఘుపతి 10 కోట్లు ఇస్తే నరేష్ కి విడాకులు ఇస్తా అని మాట్లాడిన ఆడియో లిక్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . దీనితో రమ్య రఘుపతి పై నరేష్ చేస్తున్న కామెంట్స్ వాస్తవమే అంటూ జనాలు నమ్ముతున్నారు . అంతేకాదు త్వరలోనే నరేష్ – పవిత్ర లోకేష్ గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news