Moviesఅన్నీ ఉన్నా శ్రీలీల‌కు ఆ పార్టే మైన‌స్ అయ్యింది.. అది పెంచితే...

అన్నీ ఉన్నా శ్రీలీల‌కు ఆ పార్టే మైన‌స్ అయ్యింది.. అది పెంచితే తిరుగేలేదు..!

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు తెగ వినిపిస్తోంది. శ్రీలీల నటిస్తే సినిమా హిట్ అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రోషన్ పెళ్లిసందడి, ధమాకా సినిమాలకు పాజిటివ్ టాక్ రాలేదు. అయితే శ్రీలీల హీరోయిన్ గా నటించడం ఆ సినిమాలకు ప్లస్ అయింది. ప్రస్తుతం మహేష్ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో శ్రీలీల నటిస్తున్నారు. మహేష్ మూవీలో పూజా హెగ్డే కంటే శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

అలాగే బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమాలోనూ బాల‌య్య కూతురు పాత్ర‌లో న‌టిస్తోంది.
అయితే శ్రీలీల వయస్సు కేవలం 21 సంవత్సరాలు కావడంతో స్టార్ హీరోలకు జోడీగా నటించిన సమయంలో ఆమె మరీ చిన్న పిల్లలా కనిపిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది దర్శకనిర్మాతలు ఎద అందాలు పెంచితే శ్రీలీల కెరీర్ కు ఢోకా లేనట్టేనని కామెంట్ చేసినట్టు సమాచారం.

గతంలో పలువురు హీరోయిన్లు ఎద అందాల కోసం సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే. శ్రీలీల కూడా ఆ హీరోయిన్ల బాటలో నడుస్తారేమో చూడాలి. అలాగే శ్రీలీల ఈ కామెంట్ల విషయంలో ఎలా ? రియాక్ట్ అవుతారో చూడాలి. వరుస ప్రాజెక్ట్ లతో శ్రీలీల పారితోషికం పెరుగుతోంది. ప్రస్తుతం కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్న యంగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు.

బాలయ్య – అనిల్ రావిపూడి కాంబో మూవీలో శ్రీలీల నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కృతి శెట్టి హవా తగ్గడంతో ఈ ఏడాది శ్రీలీల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. కృతికి వ‌రుస ప్లాపులు ప‌డ‌డంతో ఆమెకు ఛాన్సులు పూర్తిగా త‌గ్గిపోయాయి. ఇదే టైంలో శ్రీలీల దూసుకుపోతోంది.

మహేష్, బాలయ్య సినిమాలతో విజయాలను అందుకుంటే తన పారితోషికాన్ని రెట్టింపు చేయాలని శ్రీలీల భావిస్తోంద‌ట‌. ఇతర భాషల్లో కూడా నటిస్తున్న శ్రీలీల క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామరస్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధమేనని సమాచారం. శ్రీలీల తల్లి బెంగళూరులో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని పేరు రావడం కూడా శ్రీలీల కెరీర్ కు ప్లస్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news