Moviesస‌మంత ఆ ప‌ని మానుకోక‌పోతే కెరీర్ ఖ‌త‌మైన‌ట్టే...!

స‌మంత ఆ ప‌ని మానుకోక‌పోతే కెరీర్ ఖ‌త‌మైన‌ట్టే…!

స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌వాల్వ్‌మెంట్ తన సినిమాలలో ఈ మధ్య బాగా ఎక్కువవుతుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కథ చెప్పినప్పటినుంచి ఎడిటింగ్ అయ్యే వరకు ఎక్కువగా అన్ని విషయాలలో కలుగజేసుకుంటుందనే మాట బాగా వినిపిస్తుంది. సమంత నటించిన మొదటి సినిమా ఏ మాయచేశావే నుంచి గత చిత్రం యశోద వరకూ ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసింది.

తెలుగుతో పాటు తమిళంలో సమంత సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఇక అక్కడ, ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఎక్కువ శాతం తన ఖాతాలో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. హిట్ సినిమాలు ఎక్కువే. చాలా తక్కువ సినిమాలే సమంత డైరీలో డిజాస్టర్స్‌గా చేరాయి. ఇక మేకర్స్‌తో హీరోలతో ఒద్దికగా ఉండటంతో సమంతని ఎక్కువగా తమ సినిమాలలో తీసుకున్నారు.

అయితే, గతంలో సమంత దర్శకుడు చెప్పినట్టుగా వినేదట. కానీ, తను సోలో హీరోయిన్‌గా నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి మేకర్స్‌ను కాస్త ఇబ్బందిపెడుతుందని ఇండ‌స్ట్రీ జ‌నాలు త‌ర‌చూ మాట్లాడుకుంటున్నారు. ఇది యూటర్న్ సినిమా నుంచి మొదలైందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. యూటర్న్ తెలుగు వెర్షన్ కూడా చేయాల్సిన దర్శకుడు వేరే. కానీ, సమంత వల్ల ఒరిజినల్ తెరకెక్కించిన దర్శకుడినే తీసుకున్నారు.

ఇక తనకి నచ్చకపోతే కథలో ముఖ్యమైన సన్నివేశాలను మార్పిస్తుందట. ఇటీవల వచ్చి ఫ్లాపైన యశోద సినిమా విషయంలో సమంత ఎక్కువగా కలుగజేసుకుందట. దర్శకులిద్దరికీ పెద్దగా ఫ్రీడం ఇవ్వలేదట. సినిమాలో తన పాత్ర మాత్రమే ఎక్కువగా హైలెట్ అవ్వాలని పట్టుబట్టి ఎడిటింగ్ రూంలో చాలా సీన్స్ మార్చిందట. అందుకే, దర్శకులు అనుకున్న సక్సెస్ దక్కలేదని టాక్ ఉంది. ఇదే నిజమైతే సమంత ఇకపై కూడా సక్సెస్‌లు చూడటం కష్టమే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news