Moviesరష్మిక చేసిన ఆ ఒక్క ప‌నితోనే ఆమెకు ద‌రిద్రం ప‌ట్టుకుందా...!

రష్మిక చేసిన ఆ ఒక్క ప‌నితోనే ఆమెకు ద‌రిద్రం ప‌ట్టుకుందా…!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ మొత్తం తగ్గిపోతోందని ఆమె అభిమానులు గగ్గోలుపెడుతున్నారు. దీనికి కారణం వరుసగా అమ్మడు నటించిన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతుండటమే. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో అటు బాలీవుడ్‌లోనూ అనూహ్యంగా పాపులారిటీ తెచ్చుకుంది.

ఆమె ముందు నుంచి లైఫ్ ఇచ్చిన వాళ్ల‌ను మ‌ర్చిపోతోంద‌న్న విమ‌ర్శ‌లు మూట‌క‌ట్టుకుంటోంది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన ర‌ష్మిక ఆ త‌ర్వాత నానా మాట‌లు మాట్లాడి క‌న్న‌డీగుల ఆగ్ర‌హానికి గురైంది. ఆ త‌ర్వాత తెలుగు జ‌నాలు ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేస్తే ఆమె ఆ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీనే చిన్న చూపు చూడ‌డం మొద‌లు పెట్టేసింది. పుష్ప త‌ర్వాత హిందీ సీమలో వరుసగా సినిమాలను చేసే ఛాన్సులు దక్కించుకుంది.

అదే సమయంలో మిగతా భాషలలోనూ అవకాశాలు అందుకుంది. కానీ, పుష్ప తర్వాత మళ్ళీ ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోవడం ఆశ్చర్యకరం. హిందీలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేసిన గుడ్‌బై సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక తెలుగులో సీతారామం సినిమాలో కీలక పాత్ర చేసి ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా క్రెడిట్ మొత్తం దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తీసుకున్నారు. ఈ క్రమంలో చేసిన ద్విభాషా చిత్రం వారసుడు రష్మిక మందన్నకి సక్సెస్ ఇవ్వలేకపోయింది.

అంతకుముందు తమిళంలో కార్తి సరసన చేసిన సినిమా ఫ్లాపయింది. అలా ఇటు తెలుగులో మంచి అవకాశాలు లేక హిందీలో రీసెంట్‌గా చేసిన మిషన్ మజ్ఞు సినిమా కూడా ఫ్లాపవడంతో రష్మిక మందన్నకి పుష్ప సినిమా రూపంలో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ వచ్చినా కూడా ఆ క్రేజ్‌ని కంటిన్యూ చేయలేక సతమతమవుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ కన్నడ బ్యూటీకి మళ్ళీ భారీ హిట్ ఎప్పుడు దక్కుతుందో..నంబర్ 1 పొజిషన్‌కి ఎలా చేరుతుందో..!

Latest news