Moviesఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే..రవితేజ కెరీర్ ఎటో వెళ్ళిపోయుండేదిగా..!!

ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే..రవితేజ కెరీర్ ఎటో వెళ్ళిపోయుండేదిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న రోజుకో స్టార్ హీరో పుట్టుకొస్తున్న మన ఇండస్ట్రీలో రవితేజ పేరు చెప్తే వచ్చే పూనకాలు ..ఆ అరుపులు మరి ఏ హీరోకి రావని చెప్పాలి . అఫ్ కోర్స్ రవితేజకు ఈ మధ్యకాలంలో టైం కలిసి రాలేదు. వరుసగా డిజాస్టర్లు పడ్డాయి ..డైరెక్టర్లు కూడా రవితేజతో సినిమా తీయడానికి భయపడ్డారు . ప్రొడ్యూసర్స్ అయితే చేతులెత్తి దండం పెట్టేసి వెనక్కి వెళ్లిపోయారు. అయినా కానీ రవితేజ ఎక్కడ నిరుత్సాహపడలేదు .

Ravi Teja will be seen as a father in Chiru's next

తనలోని టాలెంట్ ను నమ్ముకుంటూ కథను నమ్మి సినిమాలు చేశారు . రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా హిట్ సినిమాలను అందుకున్నాడు రవితేజ . త్రినాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన రవితేజ.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య తో మరోసారి 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యాడు . స్టార్టింగ్ లో కూడా రవితేజ ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేశారు .

Ravi Teja's Fate Changed In 20 Days

అయితే ఓ టైం లో మాత్రం రవితేజ డబ్బు మీద వ్యామోహంతో సరైన కథను కంటెంట్ను నమ్ముకోకుండా పారితోషకాని నమ్ముకొని సినిమాలు లో నటించాడని ..ఆ కారణంగానే ఆయనకు వరుసగా డిజాస్టర్లు పడ్డాయని జనాలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు రవితేజ అప్పట్లో ఓ ఫ్రెండ్ ని బాగా నమ్మాడని ఆ కారణంగానే ఆయన కెరియర్ లో బ్యాక్ స్టెప్ వేశాడని ..ప్రజెంట్ రవితేజ తన సొంత గానే కధ వింటూ నచ్చితేనే సైన్ చేస్తున్నాడని ..ఫ్రెండ్స్ సలహా తీసుకోవట్లేదు అంటూ తెలుస్తుంది .

Waltair Veerayya Teaser Impact: Ravi Teja and Chiranjeevi

ఏది ఏమైనా సరే రవితేజ కెరీర్ లో ఆ ఫ్రెండ్ ని నమ్మకుండా ఉంటే ..ఆ మైనస్ కూడా రవితేజ లైఫ్ లో ఉండేది కాదు. త్వరలోనే రావణాసుర సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు రవితేజ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news