Moviesరాజమౌళి - మహేష్ సినిమా నుండి గూస్ బంప్స్ అప్డేట్.....

రాజమౌళి – మహేష్ సినిమా నుండి గూస్ బంప్స్ అప్డేట్.. కేకపెట్టించేస్తున్నాడుగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ..ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో బిజీగా ఉన్నాడు . కాకపోతే మూడు నెలల వ్యవధిలోనే తల్లి-తండ్రిని పోగొట్టుకున్న మహేష్ బాబు సినిమా నిర్మాతలు ఇబ్బంది పడకూడదని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు . కాగా ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే వెంటనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో మహేష్ బాబు బిజీ కానున్నాడు.

SS Rajamouli confirms film with Mahesh Babu | The News Minute

దీనికి సంబంధించిన బ్యాగ్రౌండ్ వర్క్ ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా జరిగిపోతుంది. కాగా రీసెంట్గా మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం అస్ట్రెలియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది.. మహేష్ బాబు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . అంతేనా పూర్తి అడ్వెంచర్స్ సినిమాగా తెరకెక్కబోయే ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయని .. ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలోనే చూడని విధంగా గ్రాఫిక్స్ ని రాజమౌళి చేయబోతున్నాడని తెలుస్తుంది.

Rajamouli's 'Big' Scare To Mahesh Babu

మరి ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయెల్ రోల్ లో కనిపించి మెప్పించబోతున్నట్లు తెలుస్తుంది . రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన హీరోలు డ్యూయల్ రోల్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే . ఓ విక్రమార్కుడు ..బాహుబలి ఇలా చించి చించి ఆరేస్తాడు . అంతేకాదు బాహుబలి లాగే మహేష్ బాబు సినిమా కూడా రెండు పార్ట్లుగా తెరకెక్కబోతుందట. ఈ క్రమంలోనే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news