Movies"రాసి పెట్టుకోండి..ఆ రోజు జరిగేది ఇదే".. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్..!!

“రాసి పెట్టుకోండి..ఆ రోజు జరిగేది ఇదే”.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మధ్యకాలంలో ఎలాంటి వివాదాల్లో ఇరుక్కుంటుందో అందరికీ తెలిసిన విషయమే .పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. ప్రజెంట్ పలు ప్రాజెక్ట్ లో బిజీగా ఉంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఏకంగా ఏడు బడా ప్రాజెక్ట్స్ చేసిన రష్మిక మందన .. టాలీవుడ్లో పుష్ప2 సినిమాలో నటిస్తుంది . వీటిల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయిన రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వైరల్ అవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే .

రీసెంట్గా కాంతారా డైరెక్టర్ తో మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి పెద్ద వివాదంగా మారింది . ఈ క్రమంలోనే రష్మిక మందను కన్నడ ప్రజలు బాయ్ కాట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోని రష్మిక మందన .. తన పేరుని మరింత పాపులారిటీ చేసుకుంటుంది . రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా రష్మిక అంతా హాట్ నెస్ గా ఎలా ఉండగలదు.. ఫిట్నెస్ విషయంలో ఆహార విషయంలో ఎలాంటి నియమాలు తీసుకుంటుంది ..అని అందరికీ డౌట్లు ఉన్నాయి.. వాటి గురించి స్పందిస్తూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“నచ్చింది నచ్చ్గిన్నట్లు తినేస్తానని చెప్పకు వచ్చిన రష్మిక మందన.. కచ్చితంగా వారంలో ఒక్కరోజున చీట్ డే పెట్టుకుంటానని.. ఆరోజు కావాల్సినవి మొత్తం లాగించేస్తానని ..మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని .. తన ఫ్రెండ్స్ అందరూ భోజన ప్రియులని వాళ్ళతో కూర్చుంటే అసలు డైటింగ్ అన్నమాట మర్చిపోతానని చెప్పకు వచ్చింది . నార్మల్ డేస్ లో ఉదయం లేవగానే లీటర్ వాటర్ తాగేసి తన దినచర్య మొదలవుతుందని.. ఆ తర్వాత వర్క్ అవుట్స్, స్కిప్పింగ్ యోగ వంటివి చేస్తుంటానని ..మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వాలీబాల్ మస్ట్ అని చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక డైట్ సీక్రేట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news