Moviesఅస‌లు ప‌విత్రా లోకేష్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. ఐఏఎస్ అవ్వాల్సిన ఆమె జీవితాన్ని...

అస‌లు ప‌విత్రా లోకేష్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. ఐఏఎస్ అవ్వాల్సిన ఆమె జీవితాన్ని త‌ల్ల‌కిందులు చేసింది ఎవ‌ర‌వు ?

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌తో ఎఫైర్ పెట్టుకున్న‌ప్ప‌టి నుంచి ప‌విత్రా లోకేష్ పేరు తెలుగు మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ మార్మోగిపోతోంది. దీంతో ఆమె అస‌లు ఎవ‌రు ? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ? ఆమె ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌న్న దానిపై ఎవ‌రికి వారు ఆరాలు తీస్తున్నారు. ప్ర‌స్తుతం గూగుల్లో ప‌విత్ర పెద్ద ట్రెండీ టాపిక్‌గా మారింది. అస‌లు గ‌త యేడాదిన్న‌ర కాలంగా ప‌విత్ర‌, న‌రేష్ పేరు ఎంత హాట్ టాపిక్‌గా మారిందో చూస్తూనే ఉన్నాం. మీడియాకు కూడా ఇప్పుడు వీళ్లు కావాల్సినంత స్ట‌ఫ్ కూడా ఇస్తున్నారు.

ఇక ప‌విత్ర నేప‌థ్యం విష‌యానికి వ‌స్తే ప‌విత్ర స్వ‌స్థ‌లం క‌ర్నాక‌ట‌. ఆమె తండ్రి మైసూర్ లోకేష్ కూడా న‌టుడే. అలా ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌న ప‌ట్ల ఆస‌క్తి ఏర్ప‌డింది. తండ్రి చ‌నిపోవ‌డంతో కుటుంబ పోష‌ణ నిమిత్తం ఆమె సినిమాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌ల్లో న‌టిస్తూనే ఇటు సివిల్స్ ప్రిపేర్ అయ్యింది. ఐఏఎస్ కావాల‌న్న‌ది ఆమె ల‌క్ష్యం. సొంతంగా త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డేందుకు ఆమె 16 ఏళ్ల వ‌య‌స్సులోనే క‌న్న‌డ టీవీ న‌టిగా కెరీర్ ప్రారంభించింది.

1994లో క‌న్న‌డ రెబ‌ల్ స్టార్ అంబ‌రీష్ హీరోగా న‌టించిన మిస్ట‌ర్ అభిషేక్ సినిమాలో ఆమె అంబ‌రీష్‌కు జోడీగా న‌టించింది. అప్ప‌ట్లో ఆమె అంద‌చందాల‌తో క‌న్న‌డ సినీ జ‌నాలు ఫిదా అయిపోయారు. ప‌విత్ర‌కు అంత గొప్ప అంద‌గ‌త్తె అన్న పేరు ఉండేది. హైట్‌కు త‌గిన ప‌ర్స‌నాలిటీ లేద‌ని ఆమెకు హీరోయిన్‌గా ఛాన్సులు రాక‌పోవ‌డంతో ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది.

సినిమాల్లోకి ఎప్పుడు అయితే ఎంట‌ర్ అయ్యిందో ఇక్క‌డ బిజీ అయిపోవ‌డంతో సివిల్స్ ల‌క్ష్యం వ‌దిలేసిన‌ట్ల‌య్యింది. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు 150కు పైగా సినిమాల్లో న‌టించిన ఆమె నాయి నేరాలు అనే క‌ర్నాట‌క సినిమాకు స్టేట్ అవార్డు కూడా పొందింది. ప‌విత్ర భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ కూడా టీవీ సీరియ‌ల్ న‌టుడే. అత‌డితో క‌లిసి సీరియ‌ల్స్‌లో న‌టిస్తోన్న క్ర‌మంలోనే వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు.

అయితే అంత‌కుముందే ప‌విత్ర ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అయిన యువ‌కుడిని పెళ్లాడి యేడాదికే విడాకులు ఇచ్చేసింది. సివిల్స్ సాధించాల‌నుకున్న ఆమెకు ముందుగా ఇంట్లో వాళ్లే ఓ సాఫ్ట్‌వేర్ యువ‌కుడితో పెళ్లి చేశార‌ని అంటారు. అయితే ప‌విత్ర న‌ట‌న‌లో బిజీ అవ్వ‌డంతో ఇటు వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసింది. ఆ త‌ర్వాత సుచేంద్ర ప్ర‌సాద్‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుంది.

అటు సుచేంద్ర‌కు కూడా ప‌విత్ర‌తో జ‌రిగింది రెండో పెళ్లే. మ‌రో ట్విస్టు ఏంటంటే సుచేంద్ర మొద‌టి భార్య‌, ప‌విత్ర‌కు బెస్ట్ ఫ్రెండే. ఆమె వ‌ల్లే ప‌విత్ర‌కు, సుచేంద్ర‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక న‌రేష్ విష‌యానికి వస్తే స‌మ్మోహ‌నం సినిమా షూటింగ్‌లో టైం నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత అది పీక్స్‌కు చేరుకుని వీరు స‌హ‌జీవ‌నం చేసే వ‌ర‌కు వెళ్లింద‌ట‌. ఇక ఇప్పుడు వీరు త్వ‌ర‌లోనే ఒక్క‌టి కాబోతున్నార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news