Movies' వాల్తేరు వీర‌య్య ' వ‌ర‌ల్డ్‌వైడ్ ఏరియాల వారీ ప్రి రిలీజ్...

‘ వాల్తేరు వీర‌య్య ‘ వ‌ర‌ల్డ్‌వైడ్ ఏరియాల వారీ ప్రి రిలీజ్ బిజినెస్‌… చిరంజీవి టార్గెట్ పెద్ద‌దే…!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య ఈ నెల 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది. ద‌స‌రాకు గాడ్ ఫాథ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు మూడు నెల‌ల గ్యాప్‌లోనే ఈ సంక్రాంతికి వీర‌య్య‌గా అదిరిపోయే మాస్ సినిమాతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తున్నాడు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా ఈ సినిమాలో న‌టిస్తుండ‌డంతో వీర‌య్య మ‌ల్టీస్టార‌ర్ సినిమాయే అని చెప్పాలి.

చిరుకు జోడీగా శృతీహాస‌న్‌, అటు ర‌వితేజ‌కు జోడీగా కేథ‌రిన్ థెస్రా న‌టించారు. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు చూస్తుంటే రొటీన్ క‌థే అయినా ట్రీట్‌మెంట్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని.. చిరుకు స‌పోర్టింగ్ రోల్లో ర‌వితేజ కూడా అద‌ర‌గొట్టేశాడ‌ని తెలుస్తోంది. ఇక శృతీహాస‌న్ అందాలు ఎలాగూ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. దేవిశ్రీ ఇచ్చిన మాస్ సాంగ్స్ కూడా ర్యాంపేజ్ ఆడేస్తున్నాయి.

ఇక ఆచార్య‌, గాడ్ ఫాథ‌ర్ అంచ‌నాలు అందుకోలేక‌పోయినా వాల్తేరు వీర‌య్య‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీగానే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఏరియాల వారీగా చూస్తే ఈ సినిమాకు రు. 88 కోట్ల బిజినెస్ జ‌రిగింది. చిరు రు. 89 కోట్ల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌రిలోకి దిగుతున్నారు. ఏరియాల వారీగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి.

నైజాం: 18 కోట్లు
సీడెడ్: 15 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.2 కోట్లు
తూర్పు: 6.50 కోట్లు
పశ్చిమ: 6 కోట్లు
గుంటూరు: 7.50 కోట్లు
కృష్ణ: 5.6 కోట్లు
నెల్లూరు: 3.2 కోట్లు
———————————–
ఏపీ + తెలంగాణ = 72 కోట్లు
———————————–
కర్ణాటక: 5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.00 కోట్లు
ఓవర్సీస్ – 9 కోట్లు
————————————
టోట‌ల్ వరల్డ్ వైడ్: 88 కోట్లు
————————————

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news