Moviesమైత్రీ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య మ‌ళ్లీ ఫిక్స్‌...!

మైత్రీ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య మ‌ళ్లీ ఫిక్స్‌…!

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? ఎవ్వ‌రూ ఊహించ‌ని అంచ‌నాలు ఎలా ? సెట్ అవుతాయో చెప్ప‌లేం. అలాగే ఇప్పుడు న‌ట‌సింహం బాల‌య్య‌తో ఓ డైరెక్ట‌ర్ సినిమా ఊహించ‌ని విధంగా సెట్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం దాదాపు మూడేళ్ల నుంచి క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. దానికి మైత్రీ వాళ్లు నిర్మాత‌లు. హ‌రీష్ గోల ప‌డ‌లేక కొద్ది రోజుల క్రితం ఆ సినిమాకు పూజ కూడా చేసేశారు.

అయితే ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుందో ? తెలియ‌ట్లేదు. ఇంకా చెప్పాలంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు త‌ర్వాత ఓ త‌మిళ్ రీమేక్ చేయాల్సి ఉంది. పైగా ఏపీలో వ‌చ్చే యేడాదే ఎన్నిక‌లు. అస‌లు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు తర్వాత మ‌రో సినిమా కూడా ఎన్నిక‌ల‌కు ముందు వ‌స్తుంద‌న్న‌ది డౌటే. ఎన్నిక‌ల త‌ర్వాత రాజు ఎవ‌డో ? రెడ్డి ఎవ‌డో ? ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ? చెప్ప‌లేం.

మైత్రీ వాళ్ల‌కు హ‌రీష్ శంక‌ర్ ఓ సినిమా చేయాలి. ప‌వ‌న్‌కు ఎప్పుడో కోట్ల రూపాయ‌ల అడ్వాన్స్ ఇచ్చారు. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆ సినిమా అవుతుంద‌నుకోవ‌డం క‌లే. రీసెంట్‌గా మైత్రీ వాళ్లు బాల‌య్య‌తో వీర‌సింహారెడ్డి చేసి హిట్ కొట్టారు. దీంతో ఇప్పుడు మైత్రీ బ్యాన‌ర్లో బాల‌య్య – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ సెట్ చేసే ప్ర‌య‌త్నాలు అయితే ప్రారంభ‌మ‌య్యాయి. అబ్బాయ్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య తీసి అభిమానుల అంచనాలు అందుకోలేకపోయిన హారీష్ శంకర్.. బాబాయ్ బాలయ్య తో సినిమా తీసి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి..!!

ప్ర‌స్తుతం బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా న‌డుస్తోంది. ఇది సెప్టెంబ‌ర్‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుందంటున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎన్నిక‌ల కోసం బాల‌య్య బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేసే ఆలోచ‌న‌ల్లో ఉన్నాడు. మరి అనిల్ రావిపూడి సినిమా త‌ర్వాత బోయ‌పాటి శ్రీను సినిమా ఉంటుందా ? లేదా హ‌రీష్ శంక‌ర్ – మైత్రీ వాళ్ల‌ది ప‌ట్టాలు ఎక్కుతుందా ? అన్న‌ది చూడాలి. ఏదేమైనా ప‌వ‌న్‌పై హ‌రీష్‌, మైత్రీ వాళ్లు ఇద్ద‌రు ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news