Movies'వీరసింహారెడ్డి' ఖచ్చితంగా చూడడానికి 3 ప్రధాన కారణాలు ఇవే.. ఫ్యాన్స్ డోంట్...

‘వీరసింహారెడ్డి’ ఖచ్చితంగా చూడడానికి 3 ప్రధాన కారణాలు ఇవే.. ఫ్యాన్స్ డోంట్ మిస్..!!

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటించిన సినిమా వీరసింహారెడ్డి . మైత్రి మూవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందది చేస్తుంది . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాము అంటూ మేకర్స్ ఏనాడైతే ప్రకటించారో ఆనాడే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది . అప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, సాంగ్స్ ఆధారంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అని ఫ్యాన్స్ అంచనా వేశారు .

అయితే ఆ అంచనాలను ఏమాత్రం తలకిందులు చేయకుండా .. తారుమారు చేయకుండా గోపీచంద్ మల్లి నేని తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో వీరసింహారెడ్డి సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్.. బాలయ్యను అలా చూపించిన మాస్ యాంగిల్ విధానం నందమూరి ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది, మనం ఎన్నో సినిమాల్లో మాస్ పాత్రలో చూసాం ..తొడగొట్టి చేతిలో గొడ్డలి పెట్టుకోవడం చాలా సినిమాల్లో చూసి ఉంటాం.. కానీ గోపీచంద్ మలినేని చూపించిన విధంగా బాలయ్యను మరి ఏ డైరెక్టర్ కూడా చూపించలేదని చెప్పాలి .అంతలా ఆయన బాలయ్యకు ఎంత పెద్ద ఫ్యాను ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు . అంతేకాదు ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లో చూడడానికి మూడు ప్రధాన కారణాలు ఇవే..!!

*బాలయ్య సినిమా అంటేనే సౌండ్లు , మాస్ డైలాగులు, పంచ్లతో దద్దరిల్లిపోతుంది . అలాంటి ఓ టోన్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్ బాలయ్య . మరి ముఖ్యంగా వీరిసింహారెడ్డి సినిమాల్లో కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా మారాయి .సినిమాల థియేటర్స్ చూడడానికి ఇది ఒక ప్రధాన కారణం .

*అంతేకాదు బాలయ్య ఈ సినిమాలో ఎప్పుడూ లేని విధంగా మంచి మంచి డాన్స్ స్టెప్స్ ను ఇరగదీసాడు. ఆ డ్యాన్స్ స్టెప్పులు థియేటర్లో స్క్రీన్ పై పడుతూ ఉంటే అరుపులు కేకలతో ఎంజాయ్ చేస్తున్నారు . అలాంటి ఎంజాయ్మెంట్ రావాలి అంటే కచ్చితంగా వీరసింహారెడ్డిని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే .

* ఈ సినిమాకి మరో బిగ్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ . బాలయ్య ఎంట్రీ అప్పుడు , బాలయ్య ఫైట్ చేస్తున్నప్పుడు. బాలయ్య ఎమోషన్ సీన్స్ డైలాగ్స్ చెప్తూ ఉన్నప్పుడు.. తమన్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ క్లియర్గా కనిపిస్తుంది . మరి ముఖ్యంగా బాలయ్య ఎంట్రీ అప్పుడు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ గా మారింది . ఖచ్చితంగా ఈ సీన్ థియేటర్స్ లోనే చూడాలి చూసి ఎంజాయ్ చేయాలి. సో ఇంకెందుకు ఆలస్యం దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు టికెట్ బుక్ చేసుకుని బాలయ్య సినిమాను ఎంజాయ్ చేయండి.. సంక్రాంతి ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకోండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news