Moviesవావ్: పాన్ ఇండియా సినిమాలో సితార.. మహేశ్ కూతురు రేంజ్ మామూలుగా...

వావ్: పాన్ ఇండియా సినిమాలో సితార.. మహేశ్ కూతురు రేంజ్ మామూలుగా లేదుగా..!!

సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం పెద్ద కొత్త విషయం కాదు . ఇప్పటికే బోలెడు మంది హీరోలు, హీరోయిన్లు ..తాతల పేర్లు ..నాన్నల పేర్లు ..అమ్మల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు . ఇప్పుడు ధర్డ్ జనరేషన్ క్రింద ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు స్టార్ కిడ్స్. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ..స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ లో మెరిసింది .

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ, రిలీజ్ అయితే అర్హ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది అంటూ డైరెక్టర్ సైతం చెప్పుకొస్తున్నారు. కాగా రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది మహేష్ బాబు ముద్దుల కూతురు సితార. ఘట్టమనేని వారసురాలుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న సితార అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఇప్పటికే మహేష్ బాబు సైతం సితరా హీరోయిన్గా చేయాలని డిసైడ్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . సితారకి యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయని ..తనకు యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టమని చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే ఆయన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో సితారా ని ఇంట్రడ్యూస్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సితార నటిస్తే మాత్రం కెరియర్ కి మంచి పునాది పడినట్లే అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . అంతేకాదు మొదటి సినిమాతోనే తండ్రితో రంట్రీ ఇస్తుందంటే ..సెకండ్ జనరేషన్ ని మించిపోయే రేంజ్ లో కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు థర్డ్ జనరేషన్ అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ వైరల్ అవుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news