Moviesనక్క తోక తొక్కిన తెలుగు బ్యూటీ అంజలి.. ఈ అమ్మడు అదృష్టం...

నక్క తోక తొక్కిన తెలుగు బ్యూటీ అంజలి.. ఈ అమ్మడు అదృష్టం మామూలుగా లేదుగా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ తెలుగు బ్యూటీ అంజలి నక్కతోక తొక్కిందా..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతటి క్రేజీ ఆఫర్లు తన ఖాతాలో వేసుకునింది . మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ప్రతి ఒక్కరి కల . అందరూ ఆ డ్రీమ్ ని నెరవేర్చుకోలేరు . అయితే తనకున్న కలను ఎట్టకేలకు ఫుల్ ఫీల్ చేసుకోబోతుంది నటి అంజలి .

ప్రజెంట్ రాంచరణ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అంజలి ..త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి భోలాశంకర్ సినిమాలో ఓ కీలక పాత్రలో మెరవనుంది అంటూ తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో అంజలి నెగటివ్ పాత్ర లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా – చిరంజీవి మధ్య తగాదాలు పెట్టే క్యారెక్టర్ లో అంజలి నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది .

పాజిటివ్ రోల్ అయినా ..నెగటివ్ రోల్ అయినా.. మెగాస్టార్ తో నటించడమే ఇంపార్టెంట్..అంటూ అంజలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే మొదట చరణ్ ఆ తర్వాత నాన్న చిరంజీవి ..వరుసగా ఇద్దరు మెగా హీరోలతో అవకాశాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు . అందుకే అమ్మడుని అందరూ అదృష్టవంతురాలు అంటూ పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news