MoviesNBK 107 కధ ముందు ఆ మెగా హీరో కి వెళ్లిందా..?...

NBK 107 కధ ముందు ఆ మెగా హీరో కి వెళ్లిందా..? క్లైమాక్స్ బాగోలేదని వదులుకున్నాడా..?

టాలీవుడ్ నటసిం హం నందమూరి బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి . ఆయన కెరియర్ లోనే 107వ సినిమా గా త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నందమూరి బాలయ్య జనవరి 12న సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ఫస్ట్ టీజర్.. అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.

మరీ ముఖ్యంగా బాలయ్యలోని మరో మాస్ యాంగిల్ ఈ సినిమాలో క్లియర్గా చూడొచ్చు అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. నిజానికి గోపీచంద్ మలినేని ఈ సినిమా కథను మెగా హీరో కోసం అనుకున్నారట . రామ్ చరణ్ కోసం ఈ కథను ఫిక్స్ చేసుకున్నారట . అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే ఈ సినిమా కథ ప్రిపేర్ అయిందని ..ఆ టైంలోనే రామ్ చరణ్ కు చెప్పగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుదామని కమిట్మెంట్ ఇవ్వకుండానే డైరెక్టర్ కి 50 50 ఛాన్సెస్ ఇచ్చారట .

ఈ క్రమంలోనే క్లైమాక్స్ బాగోలేదని కొంచెం చేంజస్ చేసి నెక్స్ట్ టైం కనిపించామ్ని రాంచరణ్ – గోపీచంద్ కు సలహా ఇచ్చారట . అయితే తాను అనుకున్న క్లైమాక్స్ మార్చడానికి ఇష్టం లేని గోపీచంద్ అదే కధ ను తీసుకెళ్లి నందమూరి బాలయ్యకు చెప్పగా ..ఆయన ఇంప్రెస్ అయిపోయి వెంటనే అగ్రిమెంట్ పేపర్లు తెప్పించమని సైన్ చేశారట . సీన్ కట్ చేస్తే ప్రజెంట్ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది . చూడాలి మరి చరణ్ కి నచ్చని క్లైమాక్స్ బాలయ్య కు నచ్చిన క్లైమాక్స్ జనాలకి ఎలా నచ్చుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news