Moviesదమ్ముంటే..ఎవ్వరైన ఆ విషయాని చెప్పండి..నా పేరు మార్చుకుంటా"..శ్రీలీల ఓపెన్ ఛాలెంజ్..!!

దమ్ముంటే..ఎవ్వరైన ఆ విషయాని చెప్పండి..నా పేరు మార్చుకుంటా”..శ్రీలీల ఓపెన్ ఛాలెంజ్..!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంబిబిఎస్ చదువుతున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో సినీ రంగంలోకి ప్రవేశించింది. మొదటి సినిమా పెళ్లి సందడి తో తన యావరేజ్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె నటించిన నటన , డ్యాన్స్, పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ చూసి జనాలు ఫిదా అయ్యారు . ఈ క్రమంలోని టాలీవుడ్ స్టార్ హీరో లు సైతం ఆమెను సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

అంతేకాదు ఇప్పటికే చేతిలో ఆరు బడా ప్రాజెక్ట్స్ పెట్టుకోని ఉన్న శ్రీలీక.. మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో మాస్ మహారాజ రవితేజ.. అందాల ముద్దుగుమ్మ శ్రీలీల నటిస్తున్న చిత్రం ధమాకా . డిసెంబర్ 23న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేశారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ లీల మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ..”ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ ని చూశాను ..అందరూ ఇష్టమే కానీ రవితేజ గారి లాంటి హీరోని నేను చూడలేదు . నిజానికి ఈ సినిమాలో దండకడియల్ సాంగ్ చేస్తున్నప్పుడు రవితేజ కాళ్లకి గాయమైంది . 12 కుట్లు పడ్డాయి. అయితే తన వల్ల షూట్ ఇబ్బంది పడకూడదు అని బ్రేక్ లేకుండా ఆ నొప్పి భరిస్తూ డాన్స్ చేశారు. ఎవరైనా సరే ఆ పాట చూసి రవితేజ కాళ్ళకి గాయమైన మాటను చెప్తే మాత్రం నా పేరు మార్చుకుంటా.. అంతలా తన పెయిన్ ని భరిస్తూ నవ్వుతూ డ్యాన్స్ చేశారు” అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే శ్రీలీల మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news