Moviesబాల‌య్య‌తో అల్లుకున్న ప‌వ‌న్ బంధం... ఒక్క‌దెబ్బ‌కు మూడు పిట్ట‌లు...!

బాల‌య్య‌తో అల్లుకున్న ప‌వ‌న్ బంధం… ఒక్క‌దెబ్బ‌కు మూడు పిట్ట‌లు…!

టాలీవుడ్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. బాలయ్య – పవన్ కళ్యాణ్ బంధం అల్లుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. అసలు గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి కాంపౌండ్ కు.. మెగా కాంపౌండ్ కు కెరీర్ పరంగా ఎంత యుద్ధం జరుగుతుందో చెప్పక్కర్లేదు. చివరకు అది రాజకీయపరమైన యుద్ధంగా కూడా మారింది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టిడిపి – ప్రజారాజ్యం పార్టీ నేతల మధ్య తీవ్రమైన విమర్శలు జరిగాయి. 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం విడివిడిగా పోటీ చేశాయి.

అప్పుడు జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబు టిడిపి కంటే కూడా… బాలకృష్ణను బాగా టార్గెట్ గా చేసుకునే విమర్శలు చేశారు. తన యూట్యూబ్ ఛానల్ లో బాలయ్య పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. బాలయ్య మెగా కాంపౌండ్‌తో సంబంధం లేకుండా అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరయిపోయాడు. అల్లు కాంపౌండ్ ఆహా ఓటీటీలో చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్ షో పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఇది బాలయ్యకు కెరీర్‌కు కూడా పెద్ద ట‌ర్నింగ్ పాయింట్‌.

బాలయ్య ఈ షో చేయటం మొదలుపెట్టాక అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ – అల్లు శిరీష్ కు బాగా క్లోజ్ అయిపోయాడు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ బాలయ్యను అస్సలు వదులుకునే పరిస్థితి లేదు. పైగా బాలయ్య అఖండ సినిమాకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అలాగే అల్లు అర్జున్ ఊర్వశివో రాక్షసి సినిమాకు బాలయ్య ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అన్‌స్టాప‌బుల్ టాక్ షో రెండో సీజన్ కూడా సూపర్ హిట్ దిశగా వెళుతుంది.

మరోవైపు అల్లు అరవింద్ – బాలయ్య హీరోగా తన బ్యానర్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బాల‌య్య – అల్లు బంధం అయితే పెవికాల్‌లా మారిపోయింది. ఇక ఇప్పుడు బాల‌య్య – ప‌వ‌న్ క్లోజ్ అయిపోతున్నారు. ప‌వ‌న్ వీర‌సింహారెడ్డి సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌డంతో పాటు అక్క‌డ బాల‌య్య‌, శృతీహాస‌న్ ఇత‌ర స‌భ్యుల‌తో ముచ్చ‌టించ‌డంతో పాటు ఫొటోలు దిగారు. ఇక ఈ నెల 27న బాల‌య్య అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఎపిసోడ్ షూటింగ్‌కు ప‌వ‌న్ వ‌స్తున్నాడు.

ఈ ఎపిసోడ్ న్యూ ఇయ‌ర్ కానుక‌గా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప‌వ‌న్‌- బాల‌య్య క‌ల‌యిక ఖ‌చ్చితంగా వీర‌సింహారెడ్డి ఓపెనింగ్స్‌పై ప్ర‌భావం చూపుతుందంటున్నారు. గ్రౌండ్ లెవ‌ల్లో బాల‌య్య – ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌న్నిహిత‌మ‌య్యే ఛాన్సులు ఉన్న‌ట్టు అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఏదేమైనా చిరంజీవితో కెరీర్ ప‌రంగా ఎంత పోటీ ఉన్నా అదే మెగా కాంపౌండ్‌లోకి బాల‌య్య మామూలుగా దూసుకుపోవ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news