MoviesTL రివ్యూ: 18 పేజెస్‌... ప్ర‌తి పేజ్ కొత్త‌గానే...!

TL రివ్యూ: 18 పేజెస్‌… ప్ర‌తి పేజ్ కొత్త‌గానే…!

టైటిల్‌: 18 పేజెస్‌
బ్యాన‌ర్‌: జీఏ 2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌
న‌టీన‌టులు: నిఖిల్ సిద్ధార్థ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఏ. వ‌సంత్‌
మ్యూజిక్‌: గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
నిర్మాత‌: బ‌న్నీ వాస్‌
ర‌చ‌న‌: సుకుమార్‌
ద‌ర్శ‌క‌త్వం: ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్‌
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
ర‌న్ టైం: 137 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 23, డిసెంబ‌ర్‌, 2022

 

యంగ్ హీరో నిఖిల్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హ్యాపీడేస్ చిత్రంలో నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా నటించాడు. ఆ తర్వాత యువత సినిమాతో మంచి హిట్‌ సొంతం చేసుకున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా స్వామి రారా, కార్తికేయ సినిమాల‌తో నిఖిల్ రొటీన్‌కు భిన్నంగా ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అవుతాడ‌న్న పేరు తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ప్లాపులు వ‌చ్చినా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, రీసెంట్‌గా కార్తీకేయ 2 సినిమాలో బాక్సాఫీస్‌ను ఊపేశాడు. కార్తీకేయ 2 ఏకంగా పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. అంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నిఖిల్ న‌టించిన 18 పేజెస్ ఈ రోజు రిలీజ్ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు కుమారి 21 ఎఫ్ ద‌ర్శ‌కుడు ప‌ల‌నాటి సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌కుడు. ప్ర‌చార చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌. మ‌రి నిఖిల్ త‌న స‌క్సెస్ ట్రాక్ కంటిన్యూ చేశాడా ? లేదా ? అన్న‌ది చూద్దాం.

TL స్టోరీ:
సిద్ధు (నిఖిల్) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉంటూ ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. ఆ టైంలో నందిని (అనుపమ) రాసిన డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో నందిని రాసుకున్న పాయింట్లు చ‌దివి ఆమెతో ప్రేమ‌లో ప‌డి ఆమె స్టైల్లో బ‌తికేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడు. స‌న‌తాన ట్ర‌స్ట్‌కు చెందిన రంగనాథ్ అనే వ్యక్తిని కలిసి కవర్ ఇచ్చేందుకు నందిని హైద్రాబాద్‌కు వ‌చ్చిన నందిని అక్క‌డ జ‌రిగిన విష‌యాల‌నే డైరీలో రాసుకోగా.. అదే సిద్ధుకు దొరుకుతుంది. మ‌రి ఈ డైరీలో ఉన్న విష‌యాలు ఏంటి ? నందిని చుట్టూ ఓ గ్యాంగ్ ఎందుకు ? వెంట‌ప‌డుతూ ఉంటుంది. సిద్ధు -నందిని ఎలా క‌లుస్తారు ? నందిని కోసం సిద్ధు ఏం రిస్క్ చేశాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

TL విశ్లేష‌ణ :
ఏ సినిమాలో అయినా ప్రేమ‌క‌థ ఉంటుంది. యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, కామెడీ ఉన్నా ప్రేమ త‌ప్ప‌కుండా ఉంటుంది. ఇప్ప‌టికే మ‌నం ఎన్నో ప్రేమ‌క‌థ‌లు తెర‌మీద చూశాం. ప్రేమ‌క‌థ అన‌గానే హీరో, హీరోయిన్లు క‌లిసి పాట‌లు పాడుకోవ‌డం, రొమాన్స్‌, లిప్‌కిస్‌లు ఇలాంటివి చాలా సార్లు చూసేశాం. అయితే 8 Pages సినిమాలో కొత్త కథ చూస్తాం. హీరో, హీరోయిన్లు క్లైమాక్స్ వ‌ర‌కు అస్స‌లు క‌లుసుకోరు. క‌లుసుకున్నా వారి మ‌ధ్య మాట‌లు ఉండ‌వు. అలాంటి సీన్లు తీయ‌డం, రాసుకోవ‌డం చాలా చాలా క‌ష్టం.

అయితే క‌థ రాసింది సుకుమార్‌. తీసింది శిష్యుడు సూర్య ప్రతాప్ కాబట్టి అది అసాధ్య‌మైంది సుసాధ్యమైంది. అంద‌మైన‌, స్వచ్చమైన ప్రేమకు అర్థం చెప్పేలా ఈ సినిమా తెర‌కెక్కించారు. క్లైమాక్స్‌లో ట్రైన్లో హీరో, హీరోయిన్లు ఇద్ద‌రూ క‌లుసుకునే సీన్‌. ఒక‌రినొక‌రు ప‌రిచ‌యం చేసుకునే సీన్‌ను కూడా మాట‌లు లేకుండా అద్భుతంగా రాసుకున్నారు. ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకు మాట‌లు అవ‌స‌రం లేదు.. అన్న‌ది సినిమాలో బాగా చూపించారు.

డైరీ ద్వారా నందిని మంచిత‌నం, వ్య‌క్తిత్వం న‌చ్చి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌డం, డైరీలో ఉన్న వివ‌రాల ద్వారా నందిని వెతుక్కుంటూ ఆమె ఊరికి వెళ్ల‌డం, ఆమె చ‌నిపోయింద‌ని తెలుసుకోవ‌డం… ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది ? ఇలా ప్ర‌తి సీన్ ఎంతో ఆస‌క్తితో సాగుతుంది. ప్రేమ‌కు కార‌ణాలు అవ‌స‌రం లేదు.. ఓ మంచి కార‌ణం వ‌ల్లే పుట్టిన గొప్ప ప్రేమను ఎలా కాద‌న‌గ‌లం లాంటి డైలాగులు మ‌న‌స్సును హ‌త్తుకుంటాయి.

నిఖిల్ కొత్తగా ఉన్నాడు… సిద్ధూ పాత్రలో జీవించాడు. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన ఈ తరం యువతకు హీరోయిన్‌ అనుపమ పాత్ర‌ కొత్తగా ఉంటుంది. మనమూ అలా ఉంటే బావుంటుందని అనిపించేలా క్యారెక్ట‌ర్ డిజైన్ చేశారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్‌గా అన్ని విభాగాలు బాగా ఎఫ‌ర్ట్ పెట్టాయి. గోపీసుంద‌ర్ మ్యూజిక్ బాగుంది. టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ క్యాచీగా ఉంది. నిదురన్నది లేదే ఓ పిల్లా నీ వల్ల పాట కూడా బాగుంది. నేప‌థ్య సంగీతం గుండెకు హ‌త్తుకునేలా ఉంది. కెమెరా వర్క్ చాలా నీట్‌గా ఉంది. సుకుమార్ రాసిన క‌థ‌, స్క్రీన్‌ప్లే చాలా చాలా బాగున్నా… చాలా చోట్ల లాజిక్‌లు మిస్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో లాజిక్‌లు ప‌ట్టించుకుంటే మ్యాజిక్ మిస్ అవుతాం.. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టేస్తేనే సినిమాను బాగా ఎంజాయ్ చేస్తాం.

ఫైన‌ల్‌గా…
స్వ‌చ్ఛ‌మైన‌ ప్రేమ‌క‌థా చిత్రంగా 18 పేజెస్ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతి ఇస్తుంది. నిఖిల్‌, అనుప‌మ యాక్టింగ్‌, సుకుమార్ క‌థ‌, సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం ఇవ‌న్నీ యూత్ మ‌న‌స్సుల‌ను హ‌త్తుకునేలా ఉంటాయి.

ఫైన‌ల్ పంచ్ : 18 పేజెస్‌లో ప్ర‌తీ పేజీ కొత్త‌గానే ఉంటుంది…

18 పేజెస్‌ TL రేటింగ్ : 3.25 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news