Movies"పెద్ద పెద్ద వాళ్లే అలా చేసారు.. మరి నేనెంత "..వాళ్లకు శ్రీలీల...

“పెద్ద పెద్ద వాళ్లే అలా చేసారు.. మరి నేనెంత “..వాళ్లకు శ్రీలీల పగిలిపోయే ఆన్సర్..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కాదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ పేరుని అలాగే కంటిన్యూ చేస్తూ కొన్ని సంవత్సరాలు అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నెట్టుకు రావడమే అసలైన హీరోయిన్ లక్షణాలు . అయితే ఆ లక్షణాలన్నీ పుష్కలంగా యంగ్ బ్యూటీ శ్రీలీలలో కనిపిస్తున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. ఎస్ వయసుకు చిన్న అమ్మాయి అయినా కంటెంట్ విషయంలో మాత్రం చాలా బోల్డ్ గా నిర్ణయాలు తీసుకుంటూ.. బోల్డ్ పాత్రలు చూస్ చేసుకుంటూ నేటి తరానికి ఎలాంటి ఎంజాయ్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తుంది అంటూ పలువురు సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు .

మరీ ముఖ్యంగా మొదటి సినిమాలోనే అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల ఎలాంటి ఎక్స్పోజింగ్ చేసిందో అందరికీ తెలిసిందే . చూసే కొద్ది చూడాలనిపించేలా తన అందాలను ఎక్స్పోజ్ చేసింది . ఈ క్రమంలోనే పలువులు స్టార్ హీరో సినిమాలలో అవకాశముందుకుంది. రీసెంట్గా రవితేజతో ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ అంటూ టాక్ వైరల్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రవితేజకి శ్రీలీలకి మధ్య ఏజ్ క్యాప్ చాలా ఎక్కువ గా ఉంటుంది . ఈ క్రమంలోనే ట్రోలర్స్ ఆమెనిను “అంకుల్ లాంటి వ్యక్తితో రొమాన్స్ నా” అంటీ ట్రోల్ చేస్తూ వచ్చారు. రీసెంట్ ఇంటర్వ్యూ లో అలాంటి వాళ్లకి ఇచ్చి పడేసింది శ్రీలీల.

” నేనే కాదు నాకన్నా ఇండస్ట్రీలో ముందు హీరోయిన్గా చేసిన వాళ్ళు ఎంతోమంది తమ వయసుకు మించిన వాళ్లతో రొమాన్స్ చేశారు . హీరోయిన్గా సక్సెస్ అయ్యారు . వాళ్లే నాకు ఆదర్శం . పెద్ద పెద్ద హీరోయిన్స్ నే అలా చేసిన వాళ్ళ ముందు నేనంతా చెప్పండి” అంటూ ఘాటుగా జవాబు ఇచ్చింది. దీంతో ట్రోలర్స్ కి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది శ్రీలీల అంటూ ఆమె ఫ్యాన్స్ ఆ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news