Moviesనా ఫేస్ కి అంత సీన్ లేదు రా అబ్బాయిలు..మలైకా అంత...

నా ఫేస్ కి అంత సీన్ లేదు రా అబ్బాయిలు..మలైకా అంత మాట అనేసింది ఎంట్రా బాబు..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ఎంత చెప్పినా తక్కువే . చేసిన సినిమాల కన్నా కాంట్రవర్షల్ కామెంట్స్ తోనే పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ.. ప్రజెంట్ తనకంటే చాలా వయసులో చాలా చిన్నవాడైనా బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది . కాగా ఎప్పటికప్పుడు తన హాట్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే మలైకా.. రీసెంట్గా తన నెక్స్ట్ స్టెప్ గురించి అఫిషీయల్ గా అనౌన్స్ చేసింది.

తాజాగా తన రాబోయే రియాలిటీ షో మూవింగ్ ఇన్ విత్ మలైకా కోసం సిద్ధమవుతున్న మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ క్లిప్‌లో, మలైకా అర్బాజ్ ఖాన్ నుండి విడిపోవడం మరియు ఫరా ఖాన్‌తో తన జీవితంలో తీసుకున్న డెసిషన్స్ గురించి మాట్లాడింది . దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది మలైక. దీంతో ఈ టీజర్ హైలెట్ అవుతుంది. అంతేకాదు ఆమె తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలను తీసుకున్న ప్రతి డెసిషన్ ఎలా ఫేస్ చేసింది అన్న విషయం అందరికీ కొత్తగా అనిపించింది .

” నేను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాదు ..మోస్ట్ లవబుల్ స్టార్ ని అంతకన్నా కాదు ..నన్ను అందరు చాలామంది యూత్ ఐకాన్ అంటూ పిలుస్తున్నారు ..అంత సీన్ నా ఫేస్ కి లేదురా బాబు ..ఆ మాటలు నాకు అసలు సెట్ కావు “అంటూ తన పై తనే సెటైర్స్ వేసుకుంది. బాలీవుడ్ లో మలైకా పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ షోలో తాను డేటింగ్ చేస్తున్న అర్జున్ కపూర్ పై త్వరలోనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం మరి మలైకా.. ఏ రేంజ్ లో మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news