Moviesకృతి శెట్టి కి బిగ్ షాక్.. సూర్య సంచలన నిర్ణయం..!!

కృతి శెట్టి కి బిగ్ షాక్.. సూర్య సంచలన నిర్ణయం..!!

కన్నడ బ్యూటీ కృతి శెట్టి టైం బాగోలేదా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్ పడడంతో అసలకే పాపులారిటీ తగ్గింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్న టైం లో మరో సంచలన న్యూస్ తెరపై వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలతోనూ పాజిటివ్ హిట్ లు అందుకున్న కృతి శెట్టి.. ఒక్కసారిగా స్టార్ హీరోలతో కూడా అవకాశాలు అందుకున్నింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమాకి కమిట్ అయింది. దీనికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది . కాగా రీసెంట్ గా దీనికి సంబంధించిన షాకింగ్ న్యూస్ డైరెక్టర్ బయటపెట్టాడు.

ఈ సినిమా నుండి స్టార్ హీరో సూర్య తప్పుకుంటున్నట్లు ఆయన అఫీషియల్ గా ప్రకటించారు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో, కోలీవుడ్లో వైరల్ గా మారింది.ప్రముఖ దర్శకుడు బాల తో సూర్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సూర్య బాల లాంబో అంటే జనాలకు విపరీతమైన పిచ్చి .దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబో రిపీట్ అవుతుండడంతో ఫాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది .

అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నట్లు డైరెక్టర్ బాల చెప్పుకొచ్చారు . స్క్రిప్ట్ పరంగా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని.. దాంతో ఈ కథ ఆయన బాడీ లాంగ్వాజ్ సూట్ అవ్వదని ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు . అంతేకాదు ఇద్దరూ అంగీకారంతోనే సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని చెప్పుకొచ్చాడు . అయితే సూర్యతో సినిమా అనగానే ఓ రేంజ్ లో ఊహించుకొని యాక్సెప్ట్ చేసిన కృతి ఇప్పుడు అటు ఇటు కాకుండా అడ్డంగా ఇరుక్కుపోయిందని జనాలు కామెంట్ చేస్తున్నారు. కృతి టైం బాగోలేదు అన్న దానికి ఇది మరో నిదర్శనం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news