Moviesఇంట్రెస్టింగ్: బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?

ఇంట్రెస్టింగ్: బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో వారసత్వం పేరుతో హీరోగా హీరోయిన్లుగా సెటిల్ అయినా స్టార్ ఎంతోమంది ఉన్నారు. నాన్నల పేర్లు చెప్పుకొని కొందరు ..తాతల పేర్లు చెప్పుకొని మరికొందరు ఇండస్ట్రీలో ఇప్పటికీ పాగ వేసి తమ బిడ్డలను సైతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇప్పిస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . అయితే నందమూరి ఫ్యామిలీ నుండి ఒక్క ఆడపిల్ల కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వలేదు. దానికి కారణమేంటంటూ సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది.

ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ నుండి నిహారిక ..హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున మేనకోడలు ఎంట్రీ ఇచ్చింది . కాగా నందమూరి ఫ్యామిలీ నుండి ఎందుకు ఎవ్వరు ఆడపిల్లలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వలేదు అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది . ఈ క్రమంలోని నందమూరి బాలయ్య తన డాటర్స్ ని ఎందుకు హీరోయిన్స్ చేయడం లేదు అంటూ గట్టిగా వినిపిస్తుంది. అయితే, బాలయ్యకు ఏ ప్రాబ్లం లేదని కానీ వాళ్లకే మొదటి నుంచి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదని తెలుస్తుంది.

మరి ముఖ్యంగా నారా బ్రాహ్మిణికి అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే నచ్చదని ..ఆమె ఫోకస్ అంతా బిజినెస్ వైపే ఉందని తెలుస్తుంది . అంతేకాదు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సైతం సినిమా తెరపై కనిపించడం ఇష్టం లేదట. తన పాత్ర తెర వెనుకఉండడమే ఇంపార్టెంట్ అనుకుంటుందట . ఈ క్రమంలోనే బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీలో తెరపై కనిపించలేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే బాలయ్య పెంపకం సూపర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news