Moviesఇలాంటి రొమాంటిక్ ప్ర‌పోజ‌ల్ చూడ‌లేం... సోహైల్ అంటే ఇన‌యాకు ఇంత పిచ్చా..!

ఇలాంటి రొమాంటిక్ ప్ర‌పోజ‌ల్ చూడ‌లేం… సోహైల్ అంటే ఇన‌యాకు ఇంత పిచ్చా..!

బిగ్బాస్ షోలో చాలామంది జంటలుగా మారిపోతున్నారు. హౌస్ లోపలికి వెళ్ళాక చాలామంది ఆకర్షణల ప్రభావం వల్ల ప్రేమలో పడుతున్నారు. హౌస్ లోపల ఆ జంటలు చేసే రొమాన్స్ షోకే హైలెట్గా నిలుస్తున్నాయి. ఇక మన దేశంలో అనేక భాష‌ల్లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన చాలా జంటలు ప్రేమలో పడి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్‌బాస్ షోలో లేడీ టైగ‌ర్‌గా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఇనయా సుల్తానా.

 

ఆర్జీవి బ్యూటీ అనే ట్యాగ్‌లైన్ తో ఇనయ హౌస్ లోకి ఎంటర్ అయింది. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఇనయ లేడీ సివంగిలా వచ్చిందన్న ప్రశంసలు కురిసాయి. బిగ్ బాస్ తో బోలెడంత పాపులారిటీ ఇనాయాకు దక్కింది. తాజాగా ఇన‌య‌ మరోసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ సాహెల్ తన క్రష్ అని ఇప్పటికే వినయ ఎన్నోసార్లు చెప్పింది.

తాజాగా ఇప్పుడు ఆమె అతడికి రొమాంటిక్గా ప్రపోజ్ చేసింది. అసలు ఈ ప్రపోజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోయేలా ఉంది. రెడ్ డ్రస్సులో గులాబీ పువ్వు చేతుల్లో పట్టుకుని మోకాళ్ళపై కూర్చుని మరి సోహైల్‌కు ఇనయా తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ప్రేమ ఉన్నంత వరకు మాత్రమే కాదు.. ప్రాణం ఉన్నంతవరకు నిన్నే ప్రేమిస్తా అంటూ రొమాంటిక్‌గా ఆమె చేసిన ప్రపోజ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా వైరల్ అవుతుంది.

అసలు బిగ్ బాస్ హౌస్ లోనే చెబుదాం అనుకున్నా నువ్వంటే నాకు పిచ్చి అని.. ఇప్పుడు చెబుతున్న ఐ లవ్ యు అంటూ సోహైల్‌కు ప్ర‌పోజ్ చేయడంతో సోహైల్ కూడా ఒక్కసారిగా టర్న్ అయిపోయాడు. ఇది చూసిన నెటిజ‌న్లు మ‌రో హౌస్‌లో ఆర్జే సూర్య అంటే ఇష్టం అన్నావ్ క‌దా ? అని కామెంట్లు పెడుతున్నారు. ఇక సోహైల్ హీరోగా న‌టించిన ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ మూవీ ఈ వారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news