Moviesఒక్కే ఒక్క తప్పు.. "కృతి పాతాళానికి..శ్రీలీల ఆకాశానికి"..!!

ఒక్కే ఒక్క తప్పు.. “కృతి పాతాళానికి..శ్రీలీల ఆకాశానికి”..!!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి వ్శ్ శ్రీలీల వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . మనకు తెలిసిందే ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కృతి శెట్టి కెరియర్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో అందరికి తెలిసిందే..ముట్టుకుంటే షాక్ కొట్టే అంత రేంజ్ లో ఆమె సినిమాలు ఉంటున్నాయి . ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి ..సినిమా రిలీజ్ కి ముందే ఓవర్ నైట్ స్టార్ స్టేట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకుంది .

ఈ క్రమంలోనే సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అభిమానులకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఎక్కడ లోటు చేయకుండా అన్ని సకల విధాల అందించి కృతి ఖాతాలో హిట్ వేశాడు . ఇక తర్వాత వచ్చిన నాని శ్యామ్ సింగరాయ్.. నాగార్జున బంగార్రాజు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు . అయితే ఆ ఇమేజ్ ని డబుల్ చేయడానికి ఆమెను మోడ్రన్ లుక్స్ లో దింపుతూ లింగు స్వామి చేసిన ప్రయత్నాలు బోల్తా కొట్టాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి మీద ఉన్న ఓవర్ హైప్ ని అందుకోలేకపోయాడు లింగుస్వామి.

దీంతో రామ్ పోతినేని “ది వారియర్” సినిమా డిజాస్టర్ గా మారింది . ఇక ఇదే క్రమంలో తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా బోల్తా కొట్టాయి . కాగా శ్రీ లీల సైతం అదే ఎక్స్పెక్టేషన్స్ తో అదే జోరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది . పెళ్లి సందడ్ అనే సినిమాతో ఓవర్ హైప్ క్రియేట్ చేసుకున్న శ్రీ లీల.. రెండో సినిమాకు మాత్రం చాలా గ్యాప్ తీసుకునింది . ఎంతలా అంటే ఆడియన్స్ నాడి పట్టి చదివే విధంగా శ్రీ లీల గ్యాప్ తీసుకునింది . ఈ క్రమంలోనే ఆమె అందాల కోసం ఎక్కువగా ఆతృత పడ్డ జనాలు లేటుగా ఆమె సినిమా రిలీజ్ అవ్వడంతో సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. పెళ్లి సందడి సినిమాకు..ధమాకా కు ఎంత గ్యాప్ ఉందో మనకి తెలిసిందే.

ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది . మరి ముఖ్యంగా సినిమాలో రవితేజ పర్ఫామెన్స్ కంటే శ్రీ లీల పర్ఫామెన్స్ బాగుంది అంటున్నారు జనాలు . ఇలా ఓవర్ హైప్ ఇచ్చిన కృతి శెట్టి పాతాళానికి పడిపోతే ..అదే ఓవర్ హైప్ తో కొంచెం గ్యాప్ ఇచ్చిన శ్రీలీల ఆకాశానికి ఎదిగిపోయింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news