Movies' వాల్తేరు వీర‌య్య ' ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది... రొటీన్ స్టోరీతో...

‘ వాల్తేరు వీర‌య్య ‘ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది… రొటీన్ స్టోరీతో చిరు మ్యాజిక్ చేశాడా..!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా… మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ వాల్తేరు వీరయ్య. చిరంజీవికి చిన్నప్పటి నుంచి వీరాభిమానిగా ఉన్న గుంటూరుకు చెందిన కొన్ని బాబి తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించిన వీర‌య్య‌కు దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించారు. సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి తో పోటీపడుతూ జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన బాస్ పార్టీ – చిరంజీవి, శ్రీదేవి – తాజాగా వచ్చిన టైటిల్ ట్రాక్ సాంగ్స్ అదిరిపోయాయి అని మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ మూడు సాంగ్స్‌ కు విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. సినిమాపై దర్శకుడు బాబి తో పాటు మేకర్స్.. చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రెస్ మీట్ కూడా సూపర్ సక్సెస్ అయింది.

అయితే ఈ ప్రెస్‌మీట్ లో సినిమాపై చిరంజీవి తన రివ్యూ చెప్పటం… ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. వాల్తేరు వేరే సినిమా రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ అని… అయితే లోపల మాత్రం అదిరిపోయే ఎలిమెంట్ ఉందని చిరంజీవి తెలిపారు. ఇంట్లో అమ్మ ప్రతిరోజు వంట చేస్తుంది.. అది రోజూ రొటీన్ వంక‌ట‌మే అయినా అందులో ఏదో స్పెష‌ల్ ఉంటుంది… వాల్తేరు వీర‌య్య సినిమా కూడా అలాంటిదే అని చిరు తెలిపారు.

ఇక ప్ర‌తి ఒక్క‌రు చిరు గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో ఎంత మాస్ గెట‌ప్‌లో ర‌చ్చ చేశారో.. ఇప్పుడు వీర‌య్య‌లోనూ అంతే స్టైల్లో ర‌చ్చ చేశార‌ని చెపుతున్నారు. ఓవ‌రాల్‌గా చిరు చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే వాల్తేరు వీర‌య్య రొటీన్ క‌థ‌, క‌థ‌నంతోనే ఉంటుంద‌ని.. అయితే అందులోని ఎలిమెంట్స్ కొత్త‌గా ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌రి బాబి ట్రీట్‌మెంట్‌, టేకింగ్ ఎలా ఉంటాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news