Moviesగోపీ చంద్ వెనుక ప్రభాస్ లేకపోతే..ఆయన నత్తింగ్గా.. అందుకు పనికిరాడా..?

గోపీ చంద్ వెనుక ప్రభాస్ లేకపోతే..ఆయన నత్తింగ్గా.. అందుకు పనికిరాడా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావాలి అన్నా.. వచ్చిన తర్వాత అవకాశాల్ని మరింత ఎక్కువగా దక్కించుకోవాలి అనుకున్నా .. ఆ స్టార్ హీరో స్టేటస్ అలాగే పదికాలాలపాటు చల్లగా ఉండాలి అనుకున్నా కచ్చితంగా ఇండస్ట్రీలో కొందరు సపోర్ట్ కావాలి . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అన్న పేరు తో చాలామంది స్టార్ హీరోస్ అవకాశాలు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అయితే అందరి హీరోస్ అలానే సక్సెస్ అయ్యారా..? అంటే నో అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి హెల్ప్ లేకుండానే ఇండస్ట్రీలో ఈ స్ధాయి కి ఎదిగారు.

 

బాలకృష్ణ సైతం ఫ్రెండ్షిప్ , బంధుత్వం అన్న పేరు లేకుండానే తన టాలెంట్ ని నమ్ముకొని నటసింహంగా పేరు సంపాదించుకున్నాడు . జూనియర్ ఎన్టీఆర్ , నేచురల్ స్టార్ నాని .మాస్ మహారాజ రవితేజ …ఇలా ఎంతోమంది స్టార్స్ ఫ్రెండ్షిప్ అన్న పదానికి దూరంగా ఉంటూనే అవకాశాలు దక్కించుకున్నాడు . అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఓ పనిలేని బ్యాచ్ కొందరు స్టార్ హీరో లని డి గ్రేట్ చేస్తూ తమ సొంత హీరోకి హైప్ ఇచ్చుకుంటున్నారు. అలాంటి ఖాతాలోనే బలైపోతున్నాడు మ్యాచో హీరో గోపీచంద్ .

గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..జయం సినిమాలో తన నటనకు ఎలాంటి మార్కులు పడ్డాయో అందరికీ తెలిసిందే . తొలివలపు సినిమాలో చాలా సైలెంట్ గా కనిపించిన గోపీచంద్.. జయం , వర్షం, నిజం సినిమాలో తన సెకండ్ షేడ్ చూపించి ఇండస్ట్రీని అల్లాడించాడు . అయితే రీసెంట్గా తన జాన్ జిగిడి దోస్త్ ప్రభాస్ తోపాటు అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ వచ్చిన గోపీచంద్ గురించి సోషల్ మీడియాలో వల్గర్ ట్రోలింగ్ ఎక్కువైపోయింది. గోపీచంద్ ఫేస్ కి అంత సీన్ లేదని .. ప్రభాస్ పేరు చెప్పుకోకపోతే ఆయన్ని ఈ షో కి పిలిచే వారే కాదని ..కొందరు బ్యాచ్ ఆయనని ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాదు గోపీచంద్ కొన్ని అవకాశాలు దక్కించుకునిందే ప్రభాస్ కారణంగా అంటూ ప్రభాస్ ని పొగిడేస్తూనే గోపీచంద్ ని డి గ్రేడ్ చేస్తున్నారు . వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా లేకపోతే విలన్ గా ఎంత నటన పండించిన గోపీచంద్ కి ఆ స్థానం దక్కేది కాదని ..ప్రభాస్ లేకపోతే గోపీచంద్ నత్తింగ్ అంటూ కొందరు కామెంట్ చేయడం ఇప్పుడు గోపీచంద్ ఫాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేస్తుంది . ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో కొందరు ఫాన్స్ మరి హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news