Moviesఅలాంటి సీన్ల‌లో న‌టించ‌డానికి రెడీ.. బిగ్‌బాస్ బ్యూటీ సిగ్గు వదిలేసి మ‌రీ...!

అలాంటి సీన్ల‌లో న‌టించ‌డానికి రెడీ.. బిగ్‌బాస్ బ్యూటీ సిగ్గు వదిలేసి మ‌రీ…!

సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాలో స‌మంత‌కు చెల్లెలిగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అల‌రించిన న‌టి తేజ‌శ్వి మ‌డివాడ‌. మొద‌టి సినిమాతోనే తేజ‌శ్వి మాదివాడ‌ అభిమానుల‌ను సంపాదించుకుంది. ఈ సినిమా త‌రువాత చాలా సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించింది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఐస్‌క్రీం సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో గ్లామ‌ర్ కు హ‌ద్దులు లేకుండా అన్నీ చూపించింది.

అంతే కాకుండా క‌మిట్ మెంట్ అనే సినిమాలోనూ తేజ‌స్వి బోల్డ్ లుక్ లో క‌నిపించింది. ఈ సినిమాలో ఆమె చేసిన రొమాన్స్ చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. తెలుగ‌మ్మాయి అయ్యి ఉండి తేజ‌స్వి ఇంత బోల్డ్‌గా ర‌చ్చ చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు. ఈ సినిమాతో వ‌చ్చిన పాపులారిటీ వ‌ల్ల తేజ‌స్వి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ను ద‌క్కించుకుంది. బిగ్‌బాస్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఇక బిస్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రవాత టీవీ షోలు సినిమాల్లో బిజీ అయిపోయింది. బిగ్ బాస్ త‌ర‌వాత కొద్దిరోజులే అవ‌కాశాలు ఉంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ తేజ‌స్వి సినిమాల కంటే సోష‌ల్ మీడియా గ్లామ‌ర్ షో తోనే కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. పొట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటూ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తేజ‌స్వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్ లు చేసింది.

సినిమాలో కంటెంట్ డిమాండ్ చేస్తే కిస్ సీన్లు అయినా బోల్డ్ సీన్లు అయినా చేస్తాన‌ని నిస్సిగ్గుగా చెప్పింది. బోల్డ్ స‌న్నివేశాల‌లో న‌టించ‌డానికి ఏ మాత్రం అభ్యంత‌రం చెప్ప‌ను అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంతే కాకుండా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కూడా తేజ‌స్వి స్పందించింది. త‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ క‌మిట్ మెంట్ అడ‌గ‌లేద‌ని చెప్పింది.

త‌న‌ను క‌మిట్మెంట్ అడ‌గ‌టానికి కూడా భ‌య‌ప‌డ‌తారు అంటూ కామెంట్లు చేసింది. ఇక బిగ్ బాస్ లోనూ తేజ‌స్వి త‌న బోల్డ్ కామెంట్ ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్య‌ర్య‌ప‌రిచింది. కానీ జెన్యూన్ ప‌ర్స‌న్ అని పేరు సంపాదించుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news