Moviesఆ స్టార్ జంట విడిపోతున్నారా..? పనిమనిషి లీక్ చేసిన మ్యాటర్..వైరల్..!?

ఆ స్టార్ జంట విడిపోతున్నారా..? పనిమనిషి లీక్ చేసిన మ్యాటర్..వైరల్..!?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న స్టార్ జంటలు ఎక్కువైపోయారు . రీజన్స్ ఏంటో తెలియదు కానీ చూడ చక్కగా ఉన్న ముద్దు జంటలు అన్ని పెళ్లి మూడ్ ని అనుభవించకుండానే విడాకులు తీసుకొని వేరువేరుగా జీవిస్తున్నారు . అయితే కేవలం యంగ్ కపుల్స్ నే విడాకులు తీసుకుంటున్నారా అంటే నో అని చెప్పాలి. సీనియర్ హీరో , హీరోయిన్స్ కూడా పెళ్లయిన 15 ఏళ్లు పదహారేళ్ళకు విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

ఆ లిస్టులోకి ఎంతోమంది స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఆడ్ అయ్యారు. కాగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాలో మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాళ్లు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. హీరో రన్వీర్ సింగ్ . ఎస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇన్నాళ్లయిన గుడ్ న్యూస్ చెప్పకపోవడానికి వెనుక రీజన్ అదే అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది . కాగా ఈ మధ్యనే రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీతో ఎంత రచ్చ లేపాడో మనకు తెలిసిందే.

అయితే అంతకుముందు వరకు బాగానే ఉన్న ఈ జంట రన్వీర్ న్యూడ్ ఫోటోగ్రఫీ తర్వాత దీపిక తల్లిదండ్రులు ఆయనను దూరం పెట్టారట. ఇదే క్రమంలో అమ్మ దీపిక బ్రెయిన్ వాష్ చేసి అతడికి విడాకులు ఇచ్చేలా మార్చేసిందని.. దీంతో దీపికా పదుకొనే రన్వీర్ కు దూరంగా ఉందని.. ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతే కాదు వాళ్ళ ఇంట్లో పని చేసే పనిమనిషి కూడా ఇదే న్యూస్ ని ఫ్రెండ్స్ కి కన్ఫామ్ చేసినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ఏది ఏమైనా సరే స్టార్ జంట దీపిక -రన్వీర్ విడిపోతున్నారు అంటే బాధగా అనిపిస్తుంది అంటున్నారు ఫాన్స్. దీనిపై వాళ్ళు స్పందించి ఫ్యాన్స్ కి అసలు నిజం తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి దీపికా ..రణ్వీర్ దీనిపై ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news