Moviesబాలయ్యా మజాకా.. ఎవ్వరు చేయని పని ప్రభాస్ తో చేయించాడుగా..రెబల్ ఫ్యాన్స్...

బాలయ్యా మజాకా.. ఎవ్వరు చేయని పని ప్రభాస్ తో చేయించాడుగా..రెబల్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పాన్ ఇండియా హీరో ప్రభాస్ – నందమూరి బాలయ్య షోకి సంబంధించిన పిక్స్ , వీడియోస్ నే కనిపిస్తున్నాయి..వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇమ్ళ్లల్లో ఆడవాళ్లు ముసలోళ్ళు సైతం బాలయ్య అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు అంతలా తన పేరును మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు ఈ రెబల్ హీరో. సినిమాతో తన పేరుకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా హీరో స్టేటస్ సంపాదించుకున్నాక ఫస్ట్ టైం తెలుగు లో ఓ టాక్ షో పాల్గొన్నారు.

కాగా నందమూరి బాలయ్యతో ఇంటర్వ్యూ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం అడుగుతారో.. ఎక్కడి నుంచి ఏ మేటర్ ను బయటకు తవ్వుతారో ఎవరికీ తెలియదు. చాలా సరదాగా మాట్లాడుతూనే కరెక్ట్ పాయింట్లు పట్టేస్తాడు బాలయ్య . ఈ క్రమంలోనే సైలెంట్ గా ఉండే ప్రభాస్, బాలయ్య షో కి గెస్ట్ గా వస్తున్నాడు అనగానే జనాల్లో తెలియని భయం ఏర్పడింది. ఎక్కడ ఏం మాట్లాడుతాడో,, ప్రభాస్ బాలయ్యతో మింగిల్ కాలేడేమో.. మనం ప్రభాస్ గురించి తెలుసుకోలేము అంటూ రెబల్ ఫాన్స్ టెన్షన్ పడ్దారు.

అయితే మొదటి గ్లింప్స్ చూడగానే అలాంటి క్వశ్చన్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయాయి . బాలయ్యతో ప్రభాస్ చాలా సరదాగా నవ్వుతూ ..డబ్య్ల్ ఎనర్జీతో మాట్లాడుతూ కనిపించేసరికి రెబల్ ఫాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది . అంతేకాదు అరే డార్లింగ్ అంటూ డైలాగ్ చెప్పడంతో ప్రభాస్ ఇస్ బ్యాక్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అంతేకాకుండా సరదా సరదాగా ఆడిన ఆటలు.. టాస్కుల్లో ఫన్నీగా మాట్లాడుకున్న మాటలు ..ప్రభాస్ – బాలయ్య మధ్య ఉన్న బాండింగ్ ని మరోసారి బయట పెట్టింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

హోస్ట్ గా బాలయ్య సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రభాస్ లాంటి హీరోని కూడా చిల్ అవుట్ అవుతూ సరదాగా మాట్లాడుతూ తన మైండ్ స్టేట్ లోకి తీసుకోరావడం కేవలం బాలయ్యకే చెందింది . ఈ లెక్కన చూసుకుంటే హోస్ట్ గా బాలయ్య తర్వాతే ఎవరైనా అని చెప్పాల్సిందే . ఏది ఏమైనా నందమూరి హీరో అంటే ఆ మాత్రం ఉండాలి ..తండ్రికి తగ్గ తనయుడుగా బాలకృష్ణ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news