Movies' వీర‌సింహారెడ్డి ' సుగుణ‌సుంద‌రి సాంగ్ చార్ట్ బ‌స్ట‌రే... కుమ్మి ప‌డేసింది..!

‘ వీర‌సింహారెడ్డి ‘ సుగుణ‌సుంద‌రి సాంగ్ చార్ట్ బ‌స్ట‌రే… కుమ్మి ప‌డేసింది..!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంట‌గా తెర‌కెక్కుతోన్న సినిమా వీర‌సింహారెడ్డి. అఖండ లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న సినిమా ఇదే. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌తో పాటు స్టిల్స్‌, టైటిల్ లోగో, ఫ‌స్ట్ సింగిల్ జై బాల‌య్యా సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా పెంచేశాయి.

మ‌రోవైపు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జ‌రుగుతోంది. ఇక తాజాగా ఫ‌స్ట్ సాంగ్ జై బాల‌య్య మానియాను కంటిన్యూ చేస్తూ సెకండ్ సాంగ్ కూడా వ‌చ్చేసింది. సుగుణ సుందరి అనే డ్యూయెట్ రిలీజ్ కాగా.. అవుట్ ఫుట్ అయితే సంగీత దర్శకుడు థమన్ అదరగొట్టేశాడు. ఈ రెండో సాంగ్ ఇన్సంట్ చార్ట్ బ‌స్ట‌ర్ అయ్యేలా ఉంది. స్టార్టింగ్ బీట్ నుంచే బాల‌య్య‌, శృతి ఇద్ద‌రూ కూడా అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చారు.

 

సాంగ్‌లో స్టెప్పుల‌తో పాటు చాలా స్టైలీష్‌గా క‌నిపించారు. ఇక థ‌మ‌న్ ఇచ్చిన ట్యూన్ అయితే బాల‌య్య గ‌త వింటేజ్ సాంగ్స్‌ను గుర్తుకు తెచ్చింది. ఇక సాంగ్‌కు, ట్యూన్‌కు త‌గ్గ‌ట్టుగానే కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన స్టెప్స్ కూడా ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయితే ఇక ఈ సాంగ్ థియేట‌ర్ల‌లో మంచి ట్రీట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ఈ వీర‌సింహారెడ్డి జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లోకి దిగుతోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news