Moviesస్టార్ హీరోయిన్ ని బ్రతిమిలాడి మరీ బుక్ చేసుకున్న అల్లు అరవింద్..ఇంత...

స్టార్ హీరోయిన్ ని బ్రతిమిలాడి మరీ బుక్ చేసుకున్న అల్లు అరవింద్..ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు..!?

వావ్ .. ఇది నిజంగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ కు బిగ్ బంపర్ ఆఫర్ అని చెప్పాలి . వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆమె నటించిన మూడు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మొదటగా కార్తికేయ 2తో ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరణ్.. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని 18 పేజస్ సినిమాను రిలీజ్ చేశారు . ఇది కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది.

ఇక తర్వాత “బటర్ ఫ్లై” అంటూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాను నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అనుపమ నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి . తన పిల్లల కిడ్నాప్ అయినప్పుడు అనుపమ ప్రవర్తించిన తీరు.. పెట్టిన అఫర్డ్స్ ..లేడీస్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

ఇలా హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోయిన్ ని ఎవరైనా వదులుకుంటారా..? ఈ క్రమంలోని అల్లు ఫ్యామిలి కి ఎంతో ఇష్టమైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ని అల్లు అరవింద్ స్పెషల్ రిక్వెస్ట్ క్రింద పుష్ప2లో భాగం చేస్తున్నట్లు క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప1 ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

కాగా త్వరలోనే పుష్ప2ను కూడా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సుకుమార్ . ఈ క్రమంలోని హ్యాట్రిక్ హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో బన్నీ సిస్టర్ పాత్రలో కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . అంత పెద్ద హీరోయిన్ ని బన్నీకి సిస్టర్ చేసేసావ్ గా అరవింద్ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా ద్వార ఎలాంటి హిట్ అందుకోబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news