Moviesఫేస్‌బుక్‌లో న్యూడ్ వీడియోల క‌ల‌క‌లం... యాంక‌ర్‌ విష్ణుప్రియపై పెద్ద డౌట్‌...!

ఫేస్‌బుక్‌లో న్యూడ్ వీడియోల క‌ల‌క‌లం… యాంక‌ర్‌ విష్ణుప్రియపై పెద్ద డౌట్‌…!

యాంక‌ర్ భీమినేని విష్ణుప్రియ ఈ త‌రం తెలుగు యాంక‌ర్ల‌ల‌లో మాంచి హాట్ యాంక‌ర్‌. తెలుగు బుల్లితెర యాంక‌ర్ అనే ప‌దానికి హాట్ సొగ‌సులు అద్దింది అన‌సూయ‌, ర‌ష్మీ గౌత‌మ్ అయితే ఆ యాంక‌ర్ అనే ప‌దాన్ని భారీ ఎక్స్‌పోజింగ్‌తో మ‌రింత హాట్‌గా మార్చిన వారిలో విష్ణుప్రియ‌కు ఫ‌స్ట్ ప్లేస్ ఇచ్చేయాలి. సుడిగాలి సుధీర్ తో కలిసి ఓ షోకు యాంకర్ గా పనిచేసిన విష్ణు ప్రియ ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉంది. ఇటు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో విష్ణు ప్రియ చేసే రచ్చ అంత ఇంతా కాదు.

అసలు సోషల్ మీడియాలో విష్ణుప్రియకు స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా ఆమె ఫేస్‌బుక్ పేజీలో వరుసగా అశ్లీల ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. అవి చూసిన ఆమె అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అసలు విష్ణుప్రియ న్యూడ్ ఫోటోలు, అశ్లీల ఫోటోలు షేర్ చేయడం ఏంటా ? అని షాక్ అవుతున్నారు. అయితే తన ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయిందని.. తన పేజీని అన్ ఫాలో చేయాలని తన ఫాలోవర్స్ కు రిక్వెస్ట్ చేసింది. అంతా బాగుందని అనుకుంటున్న టైంలో మళ్లీ వరుసగా విష్ణుప్రియ పేజీలో చాలా దారుణంగా అశ్లీల ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.

దీంతో విష్ణుప్రియ‌కు త‌న బంధువులు, స్నేహితుల నుంచి వ‌రుస‌గా ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ట‌. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హ్యాక‌ర్లు రెచ్చిపోయి మ‌రీ విష్ణుప్రియ అక్కౌంట్ నుంచి న్యూడ్ ఫొటోలు వైర‌ల్ అయ్యేలా చేస్తున్నారు. అస‌లు ఆ ఫొటోలు చూసేందుకే దారుణంగా ఉన్నాయి. చివ‌ర‌కు విష్ణుప్రియ కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ అస‌లు నాకే ఇలా ? ఎందుకు జ‌రుగుతోంద‌ని వాపోయింది. ఈ అశ్లీల ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమె పేజ్ ఫాలోవ‌ర్స్ విప‌రీతంగా పెరుగుతున్నారు.

ఇంత జ‌రుగుతున్నా.. ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నా ఆమె ఎందుకు ? సైలెంట్‌గా ఉంటోంది ? ఎందుకు సైబ‌ర్ క్రైంను ఆశ్ర‌యించ‌డం లేద‌న్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. అలాగే త‌న పేజ్‌ని ఎందుకు ? డిలీట్ చేయడం లేద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో నెటిజ‌న్ల‌లో కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news