Moviesఅజిత్ వాడుకొని మోసం చేస్తే అతడిపై రివేంజ్‌తో హీరా ఎవ‌రి ప్రేమ‌లో...

అజిత్ వాడుకొని మోసం చేస్తే అతడిపై రివేంజ్‌తో హీరా ఎవ‌రి ప్రేమ‌లో ప‌డిందో తెలుసా…!

జీవితం ఎవరిని ఎక్కడ తీసుకెళ్లి వదిలేస్తుందో ఎవరికి తెలుసు. ఆ విధి ఆడే వింత నాటకంలో అందరం పాత్రదారులం మాత్రమే. కొంత మంది ఈ జగన్నాటకంలో వారికి నచ్చిన తీరాన్ని చేరుతారు.. మరి కొందరు బలిపశువులుగా మారుతారు. అలంటి ఒక విధి వంచిత నటి హీరా రాజగోపాల్. తనను అందరు దోచుకున్నారు. అవసరానికి వాడుకున్నారు. అవసరం తీరక గాజుబొమ్మ లాంటి ఆమె జీవితాన్ని విసిరి వేయగా పగిలిన హృదయంతో తీరం లేని తీరానికి కొట్టుకుపోయింది. ఆలా జీవితం అంత ప్రేమ కోసం తపించి అది దొరకదు అని అర్ధం అయ్యాక సన్యాసిని గా మారిపోయింది.

ఆలా అని కాషాయ దుస్తులు ధరించి ముక్కు మూసుకొని తపస్సు చేస్తుంది అని కాదు. ఆమె మనశ్శాంతి మాత్రం వెతుకుంటూ అమెరికాలో ఉంటుంది. ఆమె సినిమా జీవితం అనుకోకుండానే మొదలయ్యింది. మొదట ప్రింట్ మ్యాగజిన్ లో మోడలింగ్ కోసం హీరాను అప్రోచ్ అయ్యారు. తాను చదువుకుంటున్న రోజుల్లో ఫైనాన్సియల్ ఇండిపెండెన్స్ కోసం తాను కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత ఎంసైక్లోపీడియా సెల్లర్ గా, మోడల్స్ కి కోఆర్డినేటర్ గా, హోటల్లో కూడా పని చేసింది.

ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా తన మొదట సినిమా ఇదయం లో నటించింది. ఇదే సినిమా తెలుగులో హృదయం పేరుతో డబ్ అయ్యి అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో 45 సినిమాల వరకు నటించింది. ఇక అప్పుడప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ తో కాదల్ కోట్టై, తోడారుమ్ వంటి సినిమాల్లో నటించింది. ఆ సమయంలో అతడితో ప్రేమలో పడింది. అతడే జీవితం అనుకుంది.

తానొక స్టార్ హీరోయిన్ అయినా కూడా అజిత్ ని ఎంతగానో నమ్మింది. ఇక హీరా దగ్గర ఉండి మరి కొన్ని సినిమాల్లో అజిత్‌కి అవకాశాలు వచ్చేలా చేసింది. కానీ ఒక్కసారి అజిత్ తన జీవితంలో సెటిల్ అయ్యాక ఆమెను నిర్లక్ష్యం చేశాడు. తనతో నటించిన మరొక హీరోయిన్ షాలినితో ప్రేమలో పడ్డాడు. ఆ బాధ నుంచి హీరా బయటకు రాలేకపోయింది. ఆ తర్వాత డ్రగ్స్ కి కూడా బానిసగా మారింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా నిర్లక్ష్యం చేసింది.

ఇక అజిత్ చేసిన మోసంతో ఆ సమయంలో తనతో నటిస్తున్న మరొక హీరోకు ప్రొపోజ్ చేసింది. అతడు మరెవరో కాదు హీరో శరత్ కుమార్. హీరా, శరత్ కుమార్ కాంబినేషన్ లో నాలుగైదు సినిమాలు వచ్చాయి. ఆ పరిచయంతో అజిత్ వ్యవహారం తర్వాత అతడికి ఒకే చెప్పింది. కానీ ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఆమె శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నప్పటికీ మనసంతా అజిత్ ని మాత్రమే నింపుకుంది.

దాంతో శరత్ కుమార్ తో బంధానికి బ్రేకులు పాడ్తాయి. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి 1999 లో మాయం అయ్యిపోయింది. ఇక హీరా తెలుగులో కూడా ప‌లు సినిమ‌లు చేసింది. యువ‌ర‌త్న బాల‌య్య‌తో యువ‌ర‌త్న రాణా సినిమాలో న‌టించింది. అమెరికాలో కొన్నాళ్ళు స్థిరపడడానికి కష్టాలు పడింది. ఆ తర్వాత ధ్యానం, యోగాతో తన జీవితాన్ని గాడిన పెట్టుకుంది. ప్రస్తుతం 50 ఏళ్ళ వయసున్నప్పటికి ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news