Moviesఆ అంద‌గ‌త్తెతో ఎన్టీఆర్ సీక్రెట్ టూర్‌... ఎఫైర్ నిజ‌మేనా...?

ఆ అంద‌గ‌త్తెతో ఎన్టీఆర్ సీక్రెట్ టూర్‌… ఎఫైర్ నిజ‌మేనా…?

సినీ జీవితంలోనే కాకుండా.. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ నిప్పులాగా జీవించిన అన్న‌గారు ఎన్టీఆర్‌పై కొన్ని మ‌ర‌క‌లు ప‌డ్డాయి. అయితే.. అవి పెద్ద‌గా ఆయ‌న కెరీర్‌పై ప్ర‌భావం చూపించ‌లేదు. సినిమాల్లో అన్న‌గారు ఎక్కువ‌గా క‌లిసి న‌టించింది.. మ‌హాన‌టి సావిత్రితోనే. త‌ర్వాత కాలంలో అంజ‌లీదేవితో. అయితే.. వీరిద్ద‌రు కాకుండా.. మ‌రో హీరోయిన్ బి. స‌రోజాదేవి. ఈవిడ చూసేందుకు ముగ్ధ మ‌నోహరంగా ఉండేవారు. ఆమెతో కూడా అన్న‌గారు అనేక సినిమాలు చేశారు. అయితే ఎన్టీఆర్ విష‌యంలో ఎప్పుడూ కూడా.. గ్యాసిప్‌ల‌కు.. ర్యూమ‌ర్ల‌కు తావు లేకుండా చూసుకునేవారు.

ఎన్టీఆర్ ఒక‌సారి ఒక సినిమా విష‌య‌మై విదేశాల‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో స‌రోజా దేవి కోరిక మేర‌కు అన్న‌గారు.. ఒక ప‌ర్యాట‌క ప్రాంతానికి వెళ్లార‌ని అంటారు. ఈ క్ర‌మంలో ఆమెతో చ‌నువుగా ఉన్నట్టు.. సినిమా ఫీల్డ్‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ వ‌చ్చింది. ఇక ఎవ‌రైనా ఓ హీరో, హీరోయిన్ విదేశీ టూర్లో ఏకాంతంగా క‌న‌ప‌డ్డారంటే అప్ప‌ట్లో మ‌ద్రాస్ ప‌త్రిక‌లు పుకార్లు అల్లేసేవి.

అయితే ఎన్టీఆర్‌ అలాంటి వారుకార‌ని.. ఆయ‌నకు ఎంతో స‌న్నిహితంగా ఉన్న ఎస్‌.డి. లాల్ వంటి ద‌ర్శ‌కులు చెప్పేవారు. అదేవిధంగా విఠ‌లాచార్య అయితే.. రామారావుగారు అలాంటివారు కాద‌య్యా! అనే వారు. అంతేకాదు.. అస‌లు రామారావే త‌ప్పు చేస్తే.. ఇక చెప్పుకోడానికి ఏముంది అనేవార‌ట‌. అయితే అంత‌కు ముందే ఎన్టీఆర్ త‌న తోటి హీరోయిన్ కృష్ణ కుమారిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అందుకే ఆ త‌ర్వాత స‌రోజాదేవితో ఏకాంతంగా టూర్‌లో క‌నిపించ‌డంతో మ‌ద్రాస్ ప‌త్రిక‌లు వార్త‌లు అల్లేశాయి.

అలా నిప్పులాగా బ‌తికిన ఎన్టీఆర్‌కు సావిత్రితోనూ ఏదో రిలేష‌న్ ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. దీనిని ఇద్ద‌రూ కూడా ఖండించ‌లేదు. ఒక సంద‌ర్భంలో ఆమెను ఇంటికి పిలిచి..బట్ట‌లు పెట్టి, కానుక‌లు ఇచ్చి తోబుట్టువు అనే ప్ర‌చారం చేసుకునేలా చేశారు. ఇలా, ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించినా.. ఎక్క‌డా ఒక్క పొర‌పాటు ప‌నికూడా చేయ‌లేద‌ని ఇండ‌స్ట్రీ ఇప్ప‌టికీ చెప్పుకొంటుంది.

ఈయ‌న బాట‌ను అనుస‌రించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే.. ఈయ‌నతోనే స్నేహం చేసిన రేలంగి వారు దారిత‌ప్పిన ప‌రిస్థితి కూడా ఉంది. ఇలా.. ఎన్టీఆర్ జీవితంలో అనేక సంఘ‌ట‌న‌లు ఇప్ప‌టికీ.. చ‌ర్చ‌కు వ‌స్తాయి. ఆద‌ర్శంగా కూడా నిలుస్తాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news