MoviesTit for Tat: అప్పుడు సమంత..ఇప్పుడు నాగ చైతన్య..చెళ్లుకి చెళ్లు..!!

Tit for Tat: అప్పుడు సమంత..ఇప్పుడు నాగ చైతన్య..చెళ్లుకి చెళ్లు..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా నాగచైతన్య-సమంత విడాకుల మేటర్. వీళ్లు విడాకులు తీసుకొని దాదాపు సంవత్సరం దాటింది . అయినా ఇప్పటికీ ప్రతిరోజు వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా గత నాలుగు రోజుల నుంచి సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసింది .

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని ..ఇన్నాళ్లు ట్రీట్మెంట్ తీసుకున్న సమంత ఇప్పుడు అఫీషియల్ గా ఆ జబ్బు గురించి బయటపెట్టింది. దీంతో ఇన్నాళ్లు సమంత ఈ కారణంగానే సోషల్ మీడియాకి దూరంగా ఉందని ఫిక్స్ అయిపోయారు జనాలు . అంతేకాదు ఈ వ్యాధి కారణంగా సమంత చాలా బాధపడుతుందని ..కండరాల నొప్పితో ముఖం ఊబ్బిపోయి ..చర్మం పై దద్దుర్లతో చాలా ఇబ్బంది పడుతుందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు సమంత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సినీ స్టార్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా దేవుని ప్రార్థిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున గాని ఆమె మాజీ భర్త నాగచైతన్యకాని ఎటువంటి మెసేజ్ చేయలేదు. ఒకప్పటి మరిది అయిన అక్కినేని అఖిల్ మాత్రం గెట్ వెల్ సూన్ సామ్ అంటూ ఓ పోస్ట్ పెట్టుకోచ్చాడు. అయితే నాగచైతన్య కానీ నాగార్జున కానీ అమలా కాని ఎవరు ఈ విషయంపై స్పందించలేదు . దీంతో నాగచైతన్య పై జనాలు ట్రోల్ చేస్తున్నారు . విడిపోయేటప్పుడు ఫ్రెండ్స్ లా ఉంటాం అన్నారు ..ఒక ఫ్రెండ్ కి బాగా లేకపోతే ఇలానే ఉంటావా అంటూ నాగచైతన్య పై బూతుల వర్షం కురిపిస్తున్నారు.

ఇదే క్రమంలో అక్కినేని అభిమానులు సమంత చేసిన గత తప్పులను బయటకు తవ్వుతున్నారు. గతంలో సమంత నాగచైతన్య పుట్టినరోజుకి విషెస్ చెప్పని సంగతి తెలిసిందే. తన కుక్క పుట్టిన రోజుకి విషెస్ చెప్పిన సమంత నాగచైతన్య పుట్టినరోజుకు మాత్రం విష్ చేయలేదు . ఇదే విషయాన్ని గుర్తు పెట్టుకొని అక్కినేని అభిమానులు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. గతంలో సమంత అలాగే బిహేవ్ చేసింది ఇప్పుడు నాగచైతన్య అలాగే చేశారు అంటూ కొందరు ..కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటూ మరికొందరు .. సమంత మయోసైటీస్ వ్యాధిని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇలాంటి టైంలో కూడా మనిషిగా నాగచైతన్య స్పందించకపోవడం బాధాకరం అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news