Moviesమగధీర లో కాజల్ కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..సిల్లీ...

మగధీర లో కాజల్ కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..సిల్లీ రీజన్ తో రిజెక్ట్..!!

మగధీర సినిమా పేరు చెప్పగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది కాలభైరవ. ఈ సినిమాలో హర్ష రోల్ చరణ్ మొదటి పార్ట్ లో నటించిన.. జనాలకి అందరికీ కాలభైరవ రోల్ నే నచ్చింది . 2009 జూలై 31న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల చేశారు . చిరుత సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సెకండ్ సినిమాతోనే టాలీవుడ్ రికార్డులను కొల్లగొట్టాడు. ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో రాజమౌళి స్క్రీన్ ప్లేకి ..కథకి జనాలు ఫిదా అయిపోయారు.

ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు లేదు అంటూ థియేటర్స్ లో ఈ సినిమాని పది సార్లు చూసిన ఫ్యాన్స్ ఉన్నారు . ఈ సినిమాలో హీరో , హీరోయిన్లుగా నటించిన రాంచరణ్ – కాజల్ అగర్వాల్ కెరియర్లను మలుపు తిప్పిన సినిమా ఇదే. ఈ సినిమా పెట్టిన దానికి డబుల్ లాభాలు తీసుకొచ్చి నిర్మాతలకు ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది . అయితే ఈ సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు తెలిసిందే.

రాజమౌళి కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా కంటెంట్ ఇచ్చి కాజల్ కెరీర్ కి బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చారు . అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అనుకునింది కాజల్ అగర్వాల్ కాదట. టాలీవుడ్ టాలెస్ట్ బ్యూటీ అనుష్క శెట్టి ని అనుకున్నారట. అప్పటికే అనుష్క విక్రమార్కుడు సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకుంది . మరోసారి రాజమౌళి డైరెక్షన్లో ఛాన్స్ వస్తే ఈమె కేరియర్ కి తిరుగు ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అనుష్క నే ఈ సినిమా రిజెక్ట్ చేసింది అని తెలుస్తుంది. చరణ్ చూడడానికి కొంచెం పొట్టిగా ఉంటాడు.. అనుష్క శెట్టి చాలా హైట్ ..తెరపై వీళ్లు అక్కా తమ్ముళ్లు లా ఉంటారు కానీ హీరో హీరోయిన్లా ఉండరు . అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news