Moviesమరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చరణ్..నక్కతోక తొక్కాడుగా..!!

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చరణ్..నక్కతోక తొక్కాడుగా..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ జెట్ స్పీడ్ లో సినిమాలకు కమిట్ అవుతూ.. తన సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాంచరణ్.. ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమాను చేస్తున్నాడు . ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంటే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.

కాగా ఈ సినిమా షూటింగ్ చేస్తూనే రామ్ చరణ్ తన తదుపరి సినిమాను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 17వ సినిమాగా తెరకెక్కబోతుందట. అంతే కాదు రామ్ చరణ్ తన 16వ సినిమా ఓ పాన్ ఇండియా డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

దీనికి మూల కారణం చిరంజీవి . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎలాగైనా సరే నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా చేయాలని చిరంజీవి తహతహలాడుతున్నారట . ఈ క్రమంలోనే ఏకంగా బడా పాన్ ఇండియా డైరెక్టర్ తో సూపర్ సినిమా ని ఫిక్స్ అయ్యారట . ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒక్కవేళ ఇది నిజంగా నిజం అయితే మాత్రం మెగా హీరోని ఢీ కోట్టే హీరో మన ఇండస్ట్రీలో ఇక రారు అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news