Moviesరాజా డీలక్స్ లో రాధేశ్యామ్ ఫిగర్ ..ఊహించని బ్యూటీ తో ప్రభాస్...

రాజా డీలక్స్ లో రాధేశ్యామ్ ఫిగర్ ..ఊహించని బ్యూటీ తో ప్రభాస్ రొమాన్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా ఫేమస్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ ఎలాంటి సినిమాలు చేస్తున్నారో మనందరికీ తెలిసిందే . తను తీసే ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవల్ లోనే ఉండేలా చూసుకుంటున్న ప్రభాస్.. సౌత్ ఇండస్ట్రీలోనే ఏ హీరో తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల నుంచి 120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . అంతే కాదు త్వరలోనే తెరకెక్కబోయే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ మూవీ కోసం ఏకంగా 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి.

 

బాహుబలి సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టని ప్రభాస్ .. తన తదుపరి సినిమా ప్రాజెక్టు కే, సల్లార్ మూవీల పై పెట్టుకున్నాడు . అంతేకాదు ఎవరు ఊహించని విధంగా ప్రభాస్ ..మారుతితో సినిమాకి కమిటీ అయ్యి అభిమానులకు షాక్ ఇచ్చాడు . అయితే ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని ఓ న్యూస్ వైరల్ అయింది. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం పూర్తి పనులు జరుగుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది. అంతేకాదు ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రాజా డీలక్స్ సినిమా.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ..మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది . కాగా మొదటి హీరోయిన్గా మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.. రెండో బ్యూటీగా కన్నడ ముద్దుగుమ్మ ఆశిక రంగనాథ్.. ఇక మూడో బ్యూటీగా మెహ్రిన్ అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెహ్రీన్ డిమాండ్ తగ్గిపోవడంతో ప్రభాస్ మూడో హీరోయిన్గా రాధ్యే శ్యామ్ లో నటించిన క్యూట్ బ్యూటీని ఫిక్స్ అయ్యిన్నట్లు సినీ వర్గాలలో న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో తారా పాత్రలో మెరిసిన అమ్మడు గుర్తుంది కదా ..ఈ సినిమాలో ఆర్చర్‌ అవ్వాలనుకున్న ఆమె.. రద్దీ ట్రైన్ యాక్సిడెంట్లు చేయ్యి పోగొట్టుకుంటుంది . ఆ అమ్మడుకే ప్రభాస్ మూడో హీరోయిన్ గా రాజా డీలక్స్ సినిమాలో అవకాసం ఇచ్చారట. దీంతో ఇంత చిన్న హీరోయిన్ ని ప్రభాస్ సెలక్ట్ చేసుకోవడం సంచలనం గా మారింది. బిగ్గెస్ట్ ఆఫర్ రావడంతో ఆమె ఎగిరికి గంతేస్తుంది. అంతే కాదు ప్రభాస్ సైతం షాక్ అయిపోతున్నారు . అసలు పేరు డిమాండ్ లేని హీరోయిన్ లో ప్రభాస్ కు అంత ఏం నచ్చిందా అంటూ ఆలోచిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news