Moviesబాల‌య్య Vs చిరు వార్‌లో వాళ్లు న‌ర‌కం చూస్తున్నారుగా... !

బాల‌య్య Vs చిరు వార్‌లో వాళ్లు న‌ర‌కం చూస్తున్నారుగా… !

అటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. ఇటు చూస్తే బాదం హల్వా అన్న‌ట్టుగా టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ సినిమాల మ‌ధ్య జ‌రుగుతోన్న వార్‌లో ఇప్పుడు ఆ సినిమాల‌కు ప‌నిచేస్తోన్న టెక్నీషియ‌న్లు అంద‌రూ న‌లిగిపోతున్నారు. వారికి తెలియ‌కుండానే వారిపై పెద్ద ప్రెజ‌ర్ ప‌డుతోంది. చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ రెండు కూడా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ఒక రోజు తేడాలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

ఇటు కామ‌న్ ఆడియెన్స్‌కు కూడా ఈ రెండు సినిమాల్లో ఏది చూడాలి.. రెండూ చూడాల‌ని అనుకుంటే ముందు ఏ సినిమా చూడాలి ? ఇలా చాలా సందేహాలే క‌లుగుతున్నాయి.ఇటు చూస్తే నంద‌మూరి బ్రాండ్‌, అటు మెగా పిక్చ‌ర్‌. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఇద్ద‌రి మ‌ధ్య పోటీ అంటే ఎంత ర‌స‌వ‌త్త‌ర‌మో 40 ఏళ్లుగా చూస్తోందే. ఇక ఈ సినిమా టెక్నీషియ‌న్ల విష‌యానికి వ‌స్తే ఇటు థ‌మ‌న్‌, అటు దేవీ. ఇటు మ‌లినేని గోపీచంద్ క్రాక్ హిట్ త‌ర్వాత చేస్తోన్న సినిమా. అటు బాబి.. వెంకీమామ త‌ర్వాత తీస్తోన్న సినిమా.

మ‌లినేని గోపీ బాల‌య్య‌కు వీరాభిమాని. అటు బాబి చిరంజీవి అంటే ప‌డి చ‌చ్చేంత ఫ్యాన్‌. ఇక రెండిట్లోనూ కొన్ని కామ‌న్ పాయింట్లు కూడా ఉన్నాయి. హీరోయిన్ శృతీహాస‌న్‌. రెండు సినిమాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీసే. అందుకే ఇప్పుడు ఈ రెండు సినిమాల హీరోల మ‌ధ్య మాత్ర‌మే కాకుండా.. ఏ సినిమా బాగుంటుంది ? ఏ సినిమా పాట‌లు బాగుంటాయి.. ఏ సినిమా ఫైట్లు బాగుంటాయి.. ఏ సినిమా క‌థ బాగుంటుంది.. ఏ సినిమా సినిమాటోగ్ర‌ఫీ బాగుంటుంది.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ కంపేరిజ‌న్ వ‌చ్చేస్తోంది.

అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం ఈ రెండు సినిమాల క‌థ‌లు మ‌రీ కొత్త‌గా అయితే ఉండ‌వు. ఇప్ప‌టికే మ‌నం చాలా సార్లు.. చాలా సినిమాల్లో చూసేసిన‌వే అంటున్నారు. అయితే ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఆ క‌థ‌ల‌ను వారి స్టైల్లో కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం అయితే చేస్తున్నార‌ట‌. ఒక దాంట్లో అన్నా, చెల్లి సెంటిమెంట్ కీల‌కం. మ‌రో దాంట్లో అన్న‌-త‌మ్ముడు సెంటిమెంట్‌. ఒక హెవీ ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో వ‌స్తుంటే… మ‌రొక‌టి ఫుల్ మాస్ సినిమా.

బాల‌య్య సినిమా ఆయ‌న‌కు ప‌ట్టున్న జాన‌ర్‌. ఇటు మెగా మూవీ ఫ్యాన్స్ బాస్‌ను ఎలా చూడాల‌నుకుంటున్నారో అచ్చం అలాంటి సినిమాయే. అందుకే ఇప్పుడు ఈ రెండు సినిమాల టెక్నీషియ‌న్లు ఆయా సినిమాల‌కు ఎంత‌లా వ‌ర్క్ చేసి త‌మ సినిమాను ముందు నిల‌బెడ‌తారు ? అన్న పోటీ రావ‌డంతో టెక్నీషియ‌న్లు బాగా టెన్ష‌న్‌తో ప‌ని చేయాల్సి వ‌స్తోంద‌ట‌. ఏ చిన్న త‌ప్పు చేసినా ఫ్యాన్స్ ట్రోలింగ్ త‌ప్ప‌దు.. విమ‌ర్శ‌లు త‌ప్ప‌దు.. అందుకే ఈ రెండు సినిమాల టెక్నీషియ‌న్లు అంద‌రూ భ‌యం భ‌యంతో ప‌ని చేస్తున్నార‌ట‌.

Latest news