Moviesఊహించని చిక్కుల్లో గెటప్ శ్రీను..చేతులెత్తేసిన సుడిగాలి సుధీర్..ఇదేనా మీ ఫ్రెండ్ షిప్...

ఊహించని చిక్కుల్లో గెటప్ శ్రీను..చేతులెత్తేసిన సుడిగాలి సుధీర్..ఇదేనా మీ ఫ్రెండ్ షిప్ ..?

గెటప్ శ్రీను… అనే పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై జబర్దస్త్ అనే షో ద్వారా హ్యూజ్ పాపులారిటీ సంపాదించుకున్న గెటప్ శ్రీను ..ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుని అటు బుల్లితెర ఇటు వెండి ధర రెండిటిలోను టాప్ పొజిషన్లో ఉన్నాడు . కాగా గెటప్ శ్రీను రీసెంట్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు కొందరు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . ఇంత టాలెంట్ ఉన్న నీకు ఆ మాత్రం తెలివి లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోని సుడిగాలి సుధీర్ పేరు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రీసెంట్గా హనుమాన్ టీజర్ రిలీజ్ చేశారు . ఈ ఈవెంట్ లో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ను ఓ రేంజ్ లో పొగిడేశారు. అంతవరకు బాగానే ఉన్నా మాటల మధ్యలో ఇండస్ట్రీకి మరో రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇక్కడే అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు .ప్రశాంత్ వర్మ గొప్ప డైరెక్టర్ కాదనడం లేదు. కానీ రాజమౌళితో కంపేర్ చేసే అంత గొప్ప డైరెక్టర్ కాదు కదా..?

రాజమౌళి కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ పాయింట్ లేదు ..నెగిటివ్ సినిమా లేదు. అయితే ప్రశాంత వర్మ చేసిన సినిమాలు హిట్ అయినా కానీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు ..ఆయన సినిమాలు రెండే రెండు హిట్టు కొట్టగానే రాజమౌళి అనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు రాజమౌళి ఫ్యాన్స్ . అతనికి టాలెంట్ ఉండొచ్చు కానీ అతను ప్రశాంత్ వర్మ ..రాజమౌళి కాదు అంటూ గెటప్ శ్రీనుకు కౌంటర్ ఇస్తున్నారు . అంతే కాదు మరి కొంతమంది రెచ్చిపోయి ఆయన ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు .

అయితే దీనిపై సుడిగాలి సుధీర్ , రాంప్రసాద్ ని కూడా లాగుతున్నారు. మీరు ఫ్రెండ్స్ అంటారు.. కానీ ఈ విషయం లో స్పందించలేదు . కనీసం ఫ్రెండ్ పై ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే మీ వంతు సహాయంగా అతడు పొరపాటున అన్నాడు ఏదైనా క్లారిటీ ఇవ్వాలి కదా ..? సైలెంట్ గా మీ పని మీరు చూసుకుంటే ఎలా..? అంటూ గెటప్ శీను ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇదేనా మీ ఫ్రెండ్ షిప్..? గెటప్ శ్రీను లేకపోతే మీ స్కిట్స్ బిస్కెట్స్.. ఎలా ఉండేటివో అందరికీ తెలుసు “అంటూ గతాన్ని తవ్వుతూ శీను, సుడిగాలి సుదీర్ ,రాంప్రసాద్ ఫ్రెండ్షిప్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒక్క మాట వాళ్ళ ఫ్రెండ్షిప్ ను విడదీసే విధంగా మారింది అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news