Moviesబిగ్ బ్రేకింగ్: యంగ్ హీరో నాగ శౌర్య కి అస్వస్ధత..హాస్పిటల్లో అడ్మిట్..!!

బిగ్ బ్రేకింగ్: యంగ్ హీరో నాగ శౌర్య కి అస్వస్ధత..హాస్పిటల్లో అడ్మిట్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించిన హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ టాలీవుడ్ యంగ్ హీరో ప్రజెంట్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీఐ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. కాగా రీసెంట్ గానే “కృష్ణవింద విహారి” అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

నాగశౌర్య పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు అనూష . ఆమె ఓ పెద్ద బిజినెస్ ఉమెన్ అని తెలుస్తుంది. కాగా నవంబర్ 19 మెహంది ..20న గ్రాండ్గా బెంగళూరులో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న నాగశౌర్య ఇలా ఎవరు ఊహించిన విధంగా తీవ్ర అస్వస్థకు గురి అవ్వడం షాకింగ్ అనిపిస్తుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఓ సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ ఉన్న నాగశౌర్య షూటింగ్ స్పాట్ లోనే సోమసిల్లి పడిపోయినట్లు తెలుస్తుంది.

దీంతో వెంటనే అప్రమత్తమైనా చిత్ర బృందం ఆయనను హుటాహుటిన దగ్గరగా ఉండే గచ్చిబౌలి ఏ ఐఈ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తుంది . అయితే ఈయన ఆరోగ్యం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా సరే మరో ఐదు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అశుభం అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news