Moviesబాలయ్య యమ బోర్..ఫ్యాన్స్ ని డీప్ గా హర్ట్ చేసిన స్టార్...

బాలయ్య యమ బోర్..ఫ్యాన్స్ ని డీప్ గా హర్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత తనదైన స్టైల్ లో కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ కోట్లాదిమంది జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికీ నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద నందమూరి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. భారీ ఫ్లెక్సీలు ..పాలాభిషేకాలు ..భారీ రేంజ్ లో పూలదండలు పట్టుకొని కనిపిస్తారు . అలాంటి ఓ హీరోతో నటించడానికి హీరోయిన్ ఇష్టపడలేదు.. ప్రజెంట్ ఇదే న్యూస్ నందమూరి ఫ్యాన్స్ ను తీవ్రంగా బాధపెడుతుంది .

మనకు తెలిసిందే తెరపై నందమూరి బాలకృష్ణ – నయనతార జంట ఎంత ఫేమస్ అనేది. వీళ్ళు కలిసి నటించిన సింహా సినిమా రికార్డులను బ్రేక్ చేసింది . అంతేకాదు తెరపై ఇద్దరి జంట సూపర్ అంటూ జనాలు కామెంట్స్ చేశారు . కాగా ఇక తర్వాత కూడా బాలకృష్ణ తో నయనతార జత కట్టింది. కాగా రీసెంట్ గా బాలయ్య నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్గా అవకాశం వస్తే ఆమె రిజెక్ట్ చేసిందట. పోనీ పెళ్లి పనుల్లో బిజీగా ఉండే రిజెక్ట్ చేసిందా అంటే కాదు బాలకృష్ణతో నటించి నతించి బోర్ కొట్టేసింది అంటూ కామెంట్ చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురైంది.

ఏది ఏమైనా సరే నిజంగా నయనతార బాలకృష్ణతో ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఆమె కెరియర్ తిరిగిపోయి ఉండేది. పక్కాగా చెప్పాలంటే నయనతార ఖాతాలో ప్రజెంట్ చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ లేవు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి సిస్టర్ గా నటించినా నయనతార ..సినిమా హిట్ అయినప్పటికీ పెద్దగా మార్కులు సంపాదించుకోలేకపోయింది . అయితే నిజంగా అమ్మడు బాలకృష్ణ తో నటించి ఉంటే మాత్రం తెలుగు తెరపై హీరోయిన్గా కొన్ని ఏళ్లు రాజ్యమేలేసి ఉండేది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సరే పెళ్లి తర్వాత నయనతార తీసుకున్న డెసిషన్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news