Moviesఓ మై గాడ్: అర్జున్ ఆస్తి అన్ని వందలా కోట్లా..కళ్లు చెదిరే...

ఓ మై గాడ్: అర్జున్ ఆస్తి అన్ని వందలా కోట్లా..కళ్లు చెదిరే ప్రాపర్టీస్..!!

అర్జున్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో తెలుగు, తమిళ, కన్నడ సినిమా పరిశ్రమను ఏలేసిన యాంగ్రీ యాక్షన్ హీరో.. దర్శకుడిగా కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కించాడు. సుమారు 130 సినిమాల్లో నటించిన అర్జున్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . కాగా ఇటీవల తన కూతురు ఐశ్వర్యాను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఓ సినిమాను డైరెక్ట్ చేశాడు . ఈ సినిమా సగంలోనే ఆగిపోయింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాగా ఇలాంటి టైం లోనే హీరో అర్జున్ ఆస్తుల వివరాలు వైరల్ గా మారాయి . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించిన అర్జున్ సుమారు 500 కోట్లకు పైగానే ఆస్తిని వెనకేసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇతడికి వివిధ దేశాల్లో వ్యాపారాల్లో కూడా భాగాలు ఉన్నట్టు సమాచారం . అంతేకాకుండా తన భార్య తరపున ఆస్తి కూడా అర్జున్ కు బాగా కలిసి వచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు. అర్జున్ హనుమంతుని వీరభక్తుడు.. ఎలాంటి సందర్భంలోనైనా సరే ..హనుమంతునికి ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు .

అంతేకాదు శ్రీ ఆంజనేయం చిత్రంలో ఆంజనేయుడు గా నటించి తన కోరికలు నెరవేర్చుకున్నాడు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అర్జున్ టోటల్ ఆస్తి 550 కోట్లుగా తెలుస్తుంది . ఇండస్ట్రీ లెక్కల ప్రకారం అర్జున్ ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు తీసుకుంటున్నారు . అంతేకాదు ఆయనకు దాదాపు 8 కోట్ల విలువచేసే ఐదు లగ్జరీకార్లు ఉన్నాయట . అర్జున్ నివసిస్తున్న ఇంటి ఖరీదు 25 కోట్లు పలుకుతుందట . అంతేకాకుండా భార్య పిల్లలు తన పేరిట ఉన్న స్థిర చర ఆస్తులు మొత్తంగా కలిపితే 550 కోట్లకు పైగాని ఉంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఆంజనేయస్వామికి వీరభక్తుడైన అర్జున్ 35 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక గుడి నిర్మిస్తున్నాడట . అతని ఇంట్లో పెద్ద ఆంజనేయ స్వామి బంగారు విగ్రహాన్ని పెట్టించుకున్నారట . చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టినఅర్జున్ 130 సినిమాలో నటించాడు. మూడు భాషల్లో సక్సెస్ అయిన హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news