Moviesఆ ఒక్క పనితో ..జపాన్ ప్రజల మనసు దోచుకున్న జూనియర్ ఎన్టీఆర్..ఏం...

ఆ ఒక్క పనితో ..జపాన్ ప్రజల మనసు దోచుకున్న జూనియర్ ఎన్టీఆర్..ఏం చేసాడో చూడండి..!!

నందమూరి నట వారసుడు జూనియర్ తారక్.. గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమానుల కోసం ఏదైనా చేసే తారక్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అభిమానులను సంతృప్తి పరచడానికి ఎంతకైనా వెళ్తాడు. అభిమానులు అంటే తారక్ కి అంత ఇష్టం. కాగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా చేసిన ఆర్ఆర్ఆర్..ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.

ఈ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగ రాసింది. కాగా రీసెంట్గా ఈ సినిమా జపాన్ లో కూడా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ జపాన్ లో అక్టోబర్ 21న గ్రాండ్గా రిలీజ్ అయింది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ మొత్తం జపాన్ కు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ.. ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకున్నారు.

కాగా ఓ ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా తారక్ ప్రజలను సర్ ప్రైజ్ చేసారు. జపనీస్ భాషలో మాట్లాడి అక్కడ వారిని ఆశ్చర్యపరిచారు . “అందరికీ నమస్కారం.. మీరందరూ ఎలా ఉన్నారు ..మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది . ఆర్ఆర్ఆర్ సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది..ఎంజాయ్ చేయ్యండి” అంటూ చెప్పుకొచ్చారు. ఇలా తారక్ జపనీస్ లో మాట్లాడటం అభిమానులకు బాగా నచ్చేసింది. దీంతో తారక్ మాట్లాడుతు ఉన్నంత సేపు.. ఎన్టీఆర్ పేరును స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయేలా అరిచారు. ఏది ఏమైనా సరే అభిమానుల్ని అట్రాక్ట్ చేయడంలో తారక్ తర్వాతే ఎవరైనా. కాగా మొదటి రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించి జపాన్ లో కూడా రికార్డ్ సృష్టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news